Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భర్తకు హ్యాండ్ ఇచ్చి స్విట్జర్లాండ్,వెళ్లిపోయిన భార్య, భర్త ఫోన్ నెంబర్ బ్లాక్, రగిలిపోయి ఏం చేశాడంటే!

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న దంపతులకు పిల్లలు ఉన్నారు. శ్రీమంతులు అయిన దంపతులు దేశ రాజధాని ఢిల్లీలో ఉంటున్నారు. కొంతకాలంగా దంపతుల మద్య తేడాలు వచ్చాయి. శ్రీమంతుల ఫ్యామిలీ కావడంతో నాలుగు గోడల మద్య పంచాయితీలు జరిగాయి. దంపతుల మద్య గొడవలు జరుగుతున్న విషయం పక్కన నివాసం ఉంటున్న వాళ్లకు కూడా తెలీదు. కొంతకాలం ఇరు వైపుల కుటుంబ సభ్యులు దంపతులకు నచ్చచెప్పి రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే భార్య మాత్రం ఎవరు చెప్పినా ఆమె పద్దతి మార్చుకోలేదని, ఎవరి మాట వినలేదని తెలిసింది.

ఇదే సమయంలో భర్తను ఇంట్లో వదిలేసిన భార్య స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. భార్య చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోయిందని ఆవేదనతో భర్త నాలుగు పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతను ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది.

 దేశ రాజధానిలో కాపురం

దేశ రాజధానిలో కాపురం

న్యూఢిల్లీ ఈస్ట్ విభాగంలోని ఉత్తమ్ నగర్ లో ఉమేష్ ధర్ త్రివేది అలియాస్ త్రివేది (41) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం త్రివేధి స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన త్రివేది, స్వప్నా దంపతులకు పిల్లలు ఉన్నారు.

 దంపతుల మధ్య తేడాలు

దంపతుల మధ్య తేడాలు

శ్రీమంతులు అయిన త్రివేది, స్వప్నాన దంపతులు దేశ రాజధాని ఢిల్లీలోన కొన్ని సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నారు. కొంతకాలంగా స్వప్నా, త్రివేది దంపతుల మద్య తేడాలు వచ్చాయి. త్రివేది, స్వప్నాలది శ్రీమంతుల ఫ్యామిలీ కావడంతో నాలుగు గోడల మద్య పంచాయితీలు జరిగాయి.

నాలుగు గోడల మద్య రాజీలు

నాలుగు గోడల మద్య రాజీలు

త్రివేది, స్వప్నా దంపతుల మద్య గొడవలు జరుగుతున్న విషయం పక్కన నివాసం ఉంటున్న వాళ్లకు కూడా తెలీదు. కొంతకాలం ఇరు వైపుల కుటుంబ సభ్యులు త్రివేదికి, ఆయన భార్య స్వప్నాకు నచ్చచెప్పి రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే త్రివేది భార్య స్వప్నా మాత్రం ఎవరు చెప్పినా ఆమె పద్దతి మార్చుకోలేదని, ఎవరి మాట వినడం లేదని తెలిసింది.

భర్తను వదిలేసి విదేశాలకు వెళ్లిపోయిన భార్య

భర్తను వదిలేసి విదేశాలకు వెళ్లిపోయిన భార్య

భర్త త్రివేదిని డిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని ఇంట్లో వదిలేసిన స్వప్నా ఆమె పిల్లలతో కలిసి ఇటీవల స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. భార్య స్వప్నా చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోయిందని త్రివేది ఆవేదన చెందాడు. తనకు వచ్చిన కష్టాలు ఎవ్వరికీ రాకూడదని త్రివేది అతని స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర విలపించాడని సమాచారం.

నాలుగు పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్య

నాలుగు పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్య

భార్య, పిల్లలు దూరం అయ్యారనే ఆవేదనతో త్రివేది ఉత్తమ్ నగర్ లోని అతని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. త్రివేది నాలుగు పేజీల డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నా భార్య నన్ను మోసం చేసి పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిపోయిందని, నా మొబైల్ నెంబర్, సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేసిందని త్రివేది డెత్ నోట్ లో రాశాడు.

శవం కూడా కుళ్లిపోయింది

శవం కూడా కుళ్లిపోయింది

ఇంటి నుంచి దుర్వాసన వస్తున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్రివేది ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితమే త్రివేది ఆత్మహత్య చేసుకున్నాడని, శవం కుళ్లిపోయిందని పోలీసు అధికారులు అంటున్నారు. త్రివేది కుటుంబ సభ్యుల నుంచి స్టేట్ మెంట్ తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఢిల్లీలోని ద్వారకా డిప్యూటీ పోలీసు కమీషనర్ శంకర్ చౌదరి మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+