Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: తండ్రి ఫ్రెండ్ తో లవ్ మ్యారేజ్, ఫస్ట్ కూతుర్ని లేపేశాడు, కోర్టు కాంపౌండ్ లో భర్తను చంపేశారు, ఫినిష్ !

మొహాలి/ సొనిపట్/ హర్యానా: ఓ యువతి, మరో వ్యక్తి ప్రేమించుకున్నారు. ఇద్దరికి వయసులో చాలా తేడా. ప్రియురాలి తండ్రి, ప్రియుడు స్నేహితులు అంటే ప్రేమికుల వయసులో ఎంతతేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. 18 నెలల క్రితం యువతిని లేపుకుపోయిన ప్రియుడు ఆర్యసమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. సొంతఊరిలో ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయని భార్యతో కలిసి వేరే ఊరిలో కాపురం పెట్టాడు. కొన్ని నెలల తరువాత అమ్మాయి ఇంటికి ఆమె తండ్రి వెళ్లాడు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం నేను, మనవాళ్లు అందరూ మరిచిపోయారని, ఇక ముందు మనం అందరూ కలిసి ఉందామని కూతురికి మాయమాటలు చెప్పాడు.

ఈ సంవత్సరం తన భర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, నువ్వు రావాలని కూతురికి చెప్పాడు. కూతురిని నమ్మించి కారులో పిలుచుకుని వెళ్లిన తండ్రి మార్గం మద్యలోనే అతని బంధువులతో కలిసి కూతురి గొంతు కోసి దారుణంగా చంపేశాడు. కూతురి శవాన్ని తండ్రి, అతని బంధువులు మాయం చేశారు. భార్య హత్య కేసులో ఆమె భర్త ప్రధాన సాక్షి. కూతురిని చంపిన తండ్రి, అతని బంధువులు జైల్లో ఉన్నారు. భార్య హత్య కేసులో కోర్టు విచారణకు హాజరైన భర్తను కోర్టు కాంపౌండ్ ఆవరణంలోనే రివాల్వర్లతో కాల్చి చంపేయడం కలకలం రేపింది.

 వయసులో 20 ఏళ్లకు పైగా తేడా

వయసులో 20 ఏళ్లకు పైగా తేడా

హర్యానాలోని సోనిపట్ సమీపంలోని ముకిన్ పూర్ గ్రామంలో వేదప్రకాష్ (43) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వేద ప్రకాష్ నివాసం ఉంటున్న గ్రామంలో నే నివాసం ఉంటున్న గ్రామంలోనే కనిక (18) అనే యువతి నివాసం ఉంటున్నది. వేద ప్రకాష్ అదే ఊరిలో నివాసం ఉంటున్న కనిక ప్రేమించుకున్నారు.

 ప్రియుడు, ప్రియురాలి తండ్రి ఫ్రెండ్స్

ప్రియుడు, ప్రియురాలి తండ్రి ఫ్రెండ్స్

కనిక తండ్రి విజయ్ పాల్, ప్రియుడు వేద ప్రకాష్ స్నేహితులు. ప్రేమికులు కనిక, వేద ప్రకాష్ వయసులో చాలా తేడా ఉంది. ప్రియురాలు కనిక తండ్రి విజయ్ పాల్, ప్రియుడు వేద ప్రకాష్ స్నేహితులు అంటే ప్రేమికుల వయసులో ఎంతతేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేమికుల విషయం కనిక ఇంట్లో తెలిసిపోవడంతో కొంతకాలం గొడవలు జరిగాయి.

 ప్రేమికుల మద్య 25 ఏళ్లు తేడా...... లవ్ మ్యారేజ్

ప్రేమికుల మద్య 25 ఏళ్లు తేడా...... లవ్ మ్యారేజ్

2020 నవంబర్ 24వ తేదీన కనికను లేపుకుపోయిన ప్రియుడు వేద ప్రకాష్ సొనిపట్ లోని ఆర్యసమాజ్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. సొంతఊరిలో ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయని భార్య కనికతో కలిసి సొనిపట్ లో సమీపంలోని వేరే ఊరిలో వేద ప్రకాష్ కాపురం పెట్టాడు. అప్పటి నుంచి కనిక, వేద ప్రకాష్ దంపతులు కొన్ని నెలల పాటు అక్కడే కాపురం ఉన్నారు.

 కూతుర్ని నమ్మించిన తండ్రి గొంతు కోసి చంపేసిన తండ్రి

కూతుర్ని నమ్మించిన తండ్రి గొంతు కోసి చంపేసిన తండ్రి

2021 జులై6వ తేదీన కూతురు కనిక ఇంటికి ఆమె తండ్రి విజయ్ పాల్ వెళ్లాడు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం నేను, మనవాళ్లు అందరూ మరిచిపోయారని, ఇక ముందు మనం అందరూ కలిసి ఉందామని విజయ్ పాల్ అతని కూతురు కనికకు మాయమాటలు చెప్పాడు. ఈ సంవత్సరం తన భర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, నువ్వు రావాలని కూతురు కనికకు చెప్పాడు.

 కూతురి గొంతు కోసి చంపేసి శవం మాయం చేసిన తండ్రి

కూతురి గొంతు కోసి చంపేసి శవం మాయం చేసిన తండ్రి

కూతురు కనికను నమ్మించి కారులో పిలుచుకుని వెళ్లిన ఆమె తండ్రి విజయ్ పాల్ మార్గం మద్యలోనే అతని బంధువులతో కలిసి కూతురిని గొంతు కోసి దారుణంగా చంపేశాడు. కూతురు కనిక శవాన్ని మీటర్ తీసుకెళ్లి గ్యాంగ్ కాలువలో విసిరేసి కేసు నుంచి తప్పించుకోవలని విజయ్ పాల్ ప్రయత్నించాడు.

 కోర్టు విచారణకు హాజరైన భర్త

కోర్టు విచారణకు హాజరైన భర్త

కొంతకాలలం తరువాత నా భార్య కనికను చంపేశారని ఆమె భర్త వేద్ ప్రకాష్ కేసు పెట్టాడు. భార్య కనిక హత్య కేసులో ఆమె భర్త వేద ప్రకాష్ ప్రధాన సాక్షి. కూతురు కనికను చంపిన ఆమె తండ్రి విజయ్ పాల్, అతని బంధువులు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు. భార్య కనిక హత్య కేసులో వేద ప్రకాష్ కోర్టు విచారణకు హాజరౌతున్నాడు.

 కోర్టు ఆవరణంలోనే భర్తను చంపేశారు

కోర్టు ఆవరణంలోనే భర్తను చంపేశారు

సొనిపట్ లోని కోర్టు విచారణకు హాజరైన వేద ప్రకాష్ అతని లాయర్ తో మాట్లాడి రూమ్ లో నుంచి బయటకు వచ్చాడు. కోర్టు కాంపౌండ్ ఆవరణంలోనే బైక్ లో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు రివాల్వర్లతో వేద ప్రకాష్ ను రివాల్వర్లతో కాల్చి చంపేయడం కలకలం రేపింది. భార్య కనిక హత్య కేసులో కోర్టులో సాక్షం చెప్పడానికి వెళ్లిన వేద ప్రకాష్ కోర్టు ఆవరణంలోనే దారుణ హత్యకు గురికావడంతో లాయర్లు, కోర్టు విచారణకు హాజరైన సామాన్య ప్రజలు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+