Wife: నిత్యం గొడవ పడుతున్న దంపతులు, ఎందో ఎవరికీ తెలీదు. ఇంట్లో భార్య శవం !
చెన్నై/సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తూ అతని భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. రాత్రి ఇంట్లో దంపతులు గొడవపడ్డారు. తరువాత భర్త బయటకు వెళ్లిపోయాడు. ఉదయం ఇంట్లో భార్య శవమైయ్యింది. భర్త కూడా మాయం కావడంతో అనుమానాలు ఎక్కువ అయ్యాయని పోలీసులు అంటున్నారు.

కూతురు, కొడుకు
తమిళనాడులోని సేలం జిల్లాలోని అత్తూరు సమీపంలోని కళ్లనట్టం గ్రామంలో మణిమారన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు, 7 సంవత్సరాల క్రితం శరణ్య (31) అనే మహిళను మాణిమారన్ వివాహం చేసుకున్నాడు. మణిమారన్, శరణ్య దంపతులకు, ఐదు సంవత్సరాల కుమార్తె మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.

గొడవలు ఎందుకు జరిగాయి ?
మణిమారన్ భవన నిర్మాణ మేస్త్రీ. కొంతకాలంగా మణిమారన్, శరణ్య దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. అయితే మణిమారన్, శరణ్య దంపతుల మద్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయం ఇరు వైపుల కుటుంబ సభ్యులకు కాని, బంధువులకు కానీ ఏమాత్రం తెలీదని సమాచారం.

ఇంట్లో శవమైన భార్య, భర్త ఎస్కేప్
ఉదయం శరణ్య ఇంటి నుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో ఆమె బందువులు వెళ్లి చూశారు. శరణ్య ఇంటిలో శవమై కనిపించింది. శరణ్య ఆత్మహత్య చేసుకుందా ?, హత్య చేశారా ? అనే విషయం మాత్రం తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు చెప్పారు. శరణ్య భర్త మణిమారన్ కూడా మాయం కావడంతో అనుమానాలు ఎక్కువ అయ్యాయని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications