తాగొద్దంటే భార్యపై సలసల కాగిన నూనే పోశాడు

మీరట్: మద్యం సేవించవద్దని చెప్పిన భార్య ముఖం మీద వేడి నూనె పోసి హత్యాయత్నం చేసిన భర్త, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ముఖం పూర్తిగా కాలిపోవడంతో బాధితురాలు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మీరట్ లోని ఉత్తమ్ నగర్ లో విజయ్ పాల్, సంతోషి అలియాస్ సంతోష (40) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. విజయ్ పాల్ నిత్యం మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను వేధించేవాడు.

మద్యం సేవించకూడదని సంతోషి భర్తకు పదేపదే చెప్పేది. అయితే అతను భార్య మాట వినలేదు. బుధవారం రాత్రి ఇదే విషయంలో దంపతుల మద్య పెద్ద గొడవ జరిగింది. గురువారం బయటకు వెళ్లిన విజయ్ పాల్ రాత్రి పీకలదాక మద్యం సేవించి అతని స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ కృష్ణ పాల్, అశోక్ తో కలిసి ఇంటికి వెళ్లాడు.

Wife objects to drinking, face thrusted in boiling oil in Meerut

అందరూ కూడా మద్యం సేవించి ఉండంటంతో సంతోషి వారిని ప్రశ్నించింది. ఇంటిలో నుండి బయటకు వెళ్లాలని గట్టిగా చెప్పింది. ఆ సమయంలో పూరీలు చెయ్యడానికి వేడి నూనె స్టౌ మీద ఉంది. విషయం గుర్తించిన విజయ్ పాల్ స్నేహితులతో కలిసి ఆ నూనె తీసుకుని భార్య ముఖం మీద పోశాడు.

ముఖం కాలిపోవడంతో నిందితులు అక్కడి నుండి పరారైనారని ఇన్స్ పెక్టర్ ఓం ప్రకాష్ తెలిపారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. నిందితులు విజయ్ పాల్, కృష్ణ పాల్ ను అరెస్టు చేశామని, అశోక్ తప్పించుకున్నాడని పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+