Wife: భార్య మీద డౌట్, భర్త ఏం చేశాడంటే ? అత్తను కూడా వదల్లేదు, ఇద్దరూ జస్ట్ మిస్ !

చెన్నై/టీ నగర్: వివాహం చేసుకున్న దంపతులు కొంతకాలం సంతోషంగా కాపురం చేశారు. దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. సందట్లో సడేమియా అంటూ భార్య పదేపదే పుట్టింటికి వెళ్లిరావడం మొదలుపెట్టింది. పుట్టింటి దగ్గర తన భార్య ఏదో చేస్తోందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి. భర్త గోడు పట్టించుకోకుండా భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఏంది ఈ రామాయణం అంటూ రగిలిపోయిన భర్త టైట్ గా మద్యం సేవించి భార్య పుట్టింటి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో భార్య ఇంట్లో లేదని తెలుసుకున్న భర్త ఇంకా ఊగిపోయాడు. తరువాత ఇంటికి వెళ్లిన భార్య మీద వేటకొడవలితో దాడి చేశాడు. అడ్డుపడిన అత్త మీద ఇష్టం వచ్చినట్లు కొడవలితో దాడి చేసి ఇద్దరిని చంపేయాలని ప్రయత్నించాడు.

 పెళ్లి చేసుకున్న కొత్తలో ?

పెళ్లి చేసుకున్న కొత్తలో ?

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని హుణసగి తాలుకాలోని యడియాపుర గ్రామంలో మాలశ్రీ అలియాస్ మాలమ్మ అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం మాలమ్మ సంతోష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొత్తలో మాల, సంతోష్ చాలా సంతోషంగా జీవించారని స్థానికులు అంటున్నారు.

 భార్య పుట్టింటికి వెలుతోందని డౌట్

భార్య పుట్టింటికి వెలుతోందని డౌట్

కొన్ని సంవత్సరాల తరువాత సంతోష్, మాల దంపతుల మద్య చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. సందట్లో సడేమియా అంటూ మాల పదేపదే పుట్టింటికి వెళ్లిరావడం మొదలుపెట్టింది. పుట్టింటి దగ్గర తన భార్య మాల ఏదో చేస్తోందని సంతోష్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో మాల, సంతోష్ దంపతుల మద్య ఇంకా గొడవలు ఎక్కువ అయ్యాయి.

 ఇంట్లో భార్య లేకపోవడంతో ఊగిపోయిన భర్త

ఇంట్లో భార్య లేకపోవడంతో ఊగిపోయిన భర్త

నువ్వు పుట్టింకి వెళ్లకూడదని సంతోష్ మొత్తుకుంటున్నా అతని గోడు ఏమాత్రం పట్టించుకోకుండా మాల మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య మాల తిరిగివస్తుందని సంతోష్ కొంతకాలం ఎదురే చూశాడు. అయితే మాల మాత్రం భర్త సంతోష్ ఇంటికి వైపు కన్నెత్తికూడా చూడలేదని తెలిసింది. భార్య మాల తీరుతో సంతోష్ ఊగిపోయాడు.

 భార్యను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు

భార్యను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు

ఎప్పుడూ ఏంది ఈ రామాయణం అంటూ రగిలిపోయిన సంతోష్ పీకలదాక మద్యం సేవించి అతని భార్య మాల ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో భార్య మాల ఇంట్లో లేదని తెలుసుకున్న సంతోష్ ఇంకా ఊగిపోయాడు. తరువాత లేటుగా ఇంటికి వచ్చిన భార్య మాలను పట్టుకుని చితకబాదేసిన సంతోష్ ఆమె మీద వేటకొడవలితో దాడి చేశాడు. మాల మీద దాడి చేస్తున్న అల్లుడు సంతోష్ ను అడ్డుకోవడానికి ఆమె తల్లి నింగమ్మ ప్రయత్నించింది.

 మద్యం మత్తులో అత్తను కూడా వదలని అల్లుడు

మద్యం మత్తులో అత్తను కూడా వదలని అల్లుడు

ఆ సమయంలో సంతోష్ కు అడ్డుపడిన అత్త మీద ఇష్టం వచ్చినట్లు కొడవలితో దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. తీవ్రగాయాలైన మాల, ఆమె తల్లి నింగమ్మను ఆసుపత్రికి తరలించారు. భార్య మాల, అత్త నింగమ్మను హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంతోష్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పీకలదాక మద్యం సేవించిన సంతోష్ అతని భార్య, అత్త మీద దాడి చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+