బాయ్ ఫ్రెండ్ తో భార్య జంప్: పిల్లల్ని చూసుకోవాల్సిన వీడు ఎం చేసాడంటే..
తమిళనాడులో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్లిపోయిందనే ఆవేశంలో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. దారుణంగా గొంతుకోసం చంపాడు. తంజావూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అతని పేరు వినోద్ కుమార్. జిల్లాలోని పెరియకోట సమీపంలో గల గోపాలసముద్రం అతని స్వస్థలం. స్థానికంగా ఫొటోగ్రాఫర్ గా పని చేస్తోన్నాడు. 12 ఏళ్ల కిందట పట్టుక్కోట్టైకి చెందిన నిత్య అనే యువతిని పెళ్లాడారు. వారికి 11 ఏళ్ల ఒవియా, ఎనిమిదేళ్ల కీర్తి, అయిదేళ్ల ఈశ్వరన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిత్యకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మన్నార్‌గుడికి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.

భర్త, పిల్లలను పట్టించుకోకుండా, నిత్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ వ్యక్తితోనే ఎక్కువ సమయం గడిపేది. ఆరు నెలల కిందట భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. దీంతో వినోద్ కుమార్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మన్నార్ గుడికి వెళ్లి నిత్యను కలిసి, తనత రావాలని బతిమాలాడు. ఆమె ఇందుకు నిరాకరించింది. ప్రియుడితోనే ఉంటానని స్పష్టం చేసింది. ఫలితంగా- భార్యపై కోపం పెంచుకున్న వినోద్ కుమార్ పిల్లలపై చూపాడు. ముగ్గురినీ హతమార్చాలని భావించాడు.
తొలుత పిల్లలకు స్వీట్లు కొనిచ్చాడు. అందులో మత్తుమందు కలిపాడు. మత్తులో ఉన్న తర్వాత ఒకరి తర్వాత ఒకరిగా గొంతు కోసి చంపాడు. ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. చేసిన నేరాన్ని అంగీకరించాడు. గొంతు కోయడానికి ఉపయోగించిన కత్తినీ పోలీసులకు అప్పగించాడు.తన భార్య అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయిందనే ఆగ్రహంతోనే వినోద్ కుమార్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications