‘వేళాపాళా లేదు.. చచ్చిపోతున్నాను’,భర్త సెక్స్ పిచ్చిపై పోలీసులకు భార్య ఫిర్యాదు!

తన భర్త పదే పదే లైంగిక వాంఛ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడని, ఈ విషయంలో అతడి హింసను తను తట్టుకోలేక పోతున్నానంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెంగళూరు: ఒక వైపు మ్యారిటల్ రేప్.. నేరం కాదు అని సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో నమోదైన ఈ కేసు ఆసక్తిదాయకంగా ఉంది. తన భర్త పదే పదే లైంగిక వాంఛ తీర్చమని ఒత్తిడి చేస్తున్నాడని, ఈ విషయంలో అతడి హింసను తను తట్టుకోలేక పోతున్నానంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని బొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో ఈ చిత్రమైన కేసు నమోదైంది.

బాధితురాలి కథనం మేరకు కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమె భర్త ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. 2008లో వీరికి వివాహమైంది. మొదట్లో అతడు బాగానే చూసుకునేవాడు. అయితే రానరాను అతడికి సెక్స్ పిచ్చి ఎక్కువ అయ్యింది.

Wife's Complaint against Husband's Torture for Sex

నిత్యం అదే ధ్యాస. ఉదయం టిఫిన్ చేసిన వెంటనే పడకింటికి చేరి ఆమెను పిలిచేవాడు. ఇక ఆఫీసుకు వెళ్లి వచ్చిన తర్వాత అతడిని తట్టుకోవడం ఆమెకు మరింత కష్టం అయ్యేది. ఆఫీసు నుంచి రాగానే, భోజనానికి ముందు, భోజనానికి తర్వాత, అర్ధరాత్రుళ్లు.. ఇలా లెక్క పెట్టడానికి కష్టమైనన్ని సార్లు.. ఆమెను శృంగారంలో పాల్గొనమనేవాడు. ఇది ఆమెకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది.

ఈ తీరును భరించలేక అతడి గురించి.. ఆమె ఇంట్లో పెద్ద వాళ్లకు చెప్పింది. అతడి తల్లిదండ్రులకు కూడా చెప్పింది. కానీ వారు తమ కొడుకునే వెనకేసుకొచ్చేవారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడిన ఆమె.. ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. బొమ్మనహళ్లి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. మరి వివాహానంతరం భర్త ఒత్తిడి చేసి శృంగారంలో పాల్గొన్నా అది అత్యాచారం ఏమీ కాదని, దాన్ని రేప్ గా పరిగణించలేమని, అది నేరం కాదని సుప్రీం కోర్టు స్థాయిలో తీర్పు వచ్చిన క్రమంలో.. ఇలాంటి కేసుల్లో బాధితురాళ్లకు ఏ విధమైన న్యాయం జరుగుతుంది?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+