Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Techie: హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన భార్య, అంతా నువ్వే చేశావని తల్లిని చంపిన కొడుకు, టెక్కీకి త్రీడీ సినిమా !

గురుగ్రామ్/ న్యూఢిల్లీ: రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, ఆరోగ్య శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న మహిళ గతంలో వివాహం చేసుకున్నారు. దంపతుల కుమారుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యగం చేస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం దంపతులు వాళ్ల కుమారుడికి పెళ్లి చేశారు. టెక్కీ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. తండ్రి రైల్లే శాఖలో, తల్లి ఆరోగ్య శాఖ డిప్యూటీ సూపరిండెంట్ గా పని చేస్తూ రిటైడ్ అయ్యారు. టెక్కీ దంపతులకు, ఉద్యోగాలు చేస్తూ రిటైడ్ అయిన టెక్కీ తల్లిదండ్రుల మద్య చిన్నచిన్న తేడాలు రావడంతో రెండు కుటుంబాలు ఒకే ప్రాంతంలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు.

టెక్కీతో గొడవపడిన అతని భార్య కొడుకును పిలుచుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య, కొడుకును ఇంటికి పిలుచుకురావాలని టెక్కీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే భార్య మాత్రం భర్తతో కాపురం చెయ్యడానికి అంగీకరించకుండా ఆమె పుట్టింటిలోనే మకాం వేసింది. వాకింగ్ వెలుతున్న దంపతులకు మార్గం మద్యలో వాళ్ల కొడుకు ఎదురు వచ్చాడు. నువ్వు మాట్లాడి ఇంటికి రా అంటూ భర్త వెళ్లి పోవడంతో ఆయన భార్య పార్క్ సమీపంలో నిలబడి కొడుకుతో మాట్లాడుతోంది. ఆ సందర్బంలో టెక్కీ అతని భార్య విషయం గురించి అతని తల్లితో చర్చించాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన టెక్కీ అతని కన్న తల్లిని రోడ్డు మీదకు తోసేసి కాళ్లతో తన్నుతూ కత్తి తీసుకుని ఇష్టం వచ్చినట్లు పొడవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

 దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే

దంపతులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే

గురుగ్రామ్ లో నివాసం ఉంటున్న రణవీర్ కుమార్ భండారీ అనే ఆయన భారత రైల్వే శాఖలో మంచి ఉద్యోగం చేసేవారు. 35 సంవత్సరాల క్రితం ఆరోగ్య శాఖలో ఉద్యోగం చేస్తున్న మీనా కుమారి అనే మహిళను రణవీర్ కుమార్ వివాహం చేసుకున్నారు. సంతోషంగా కాపురం చేసిన రణవీర్ కుమార్, మీనా కుమారి దంపతులకు మనీష్ భండారి (32) అనే కుమారుడు ఉన్నాడు.

 టెక్కీకి గ్రాండ్ గా పెళ్లి

టెక్కీకి గ్రాండ్ గా పెళ్లి

రణవీర్ కుమార్, మీనాకుమారి దంపతుల కుమారుడు మనీష్ భండారి ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రముఖ టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితంరణవీర్ కుమార్, మీనాకుమారి దంపతులు వాళ్ల కుమారుడు మనీష్ కు చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. మనీష్ భండారి దంపతులకు నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు.

 టెక్కీ దంపతులు, రిటైడ్ దంపతులు వేర్వేరు కాపురాలు

టెక్కీ దంపతులు, రిటైడ్ దంపతులు వేర్వేరు కాపురాలు

టెక్కీ మనీష్ భండారి దంపతులకు కొడుకు పుట్టిన తరువాత ఇంట్లో సమస్యలు, గొడవలు మొదలైనాయని సమాచారం. మనీష్ భండారి తండ్రి రణబీర్ సింగ్ రైల్లే శాఖలో, తల్లి మీనా కుమారి ఆరోగ్య శాఖ డిప్యూటీ సూపరిండెంట్ గా పని చేస్తూ రిటైడ్ అయ్యారు. టెక్కీ మనీష్ భండారి దంపతులకు, ఉద్యోగాలు చేస్తూ రిటైడ్ అయిన టెక్కీ తల్లిదండ్రుల మద్య చిన్నచిన్న తేడాలు రావడంతో రెండు కుటుంబాలు గురుగ్రామ్ లోని శివపురి ప్రాంతంలోనే వేర్వేరు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు.

 హ్యాండ్ ఇచ్చిన భార్య

హ్యాండ్ ఇచ్చిన భార్య

అత్తమామలు దూరం అయినా టెక్కీ మనీష్ తో అతని భార్య నిత్యం గొడవలు పడటం మొదలు పెట్టింది. చివరికి భర్త మనీష్ భండారితో గొడవపడిన అతని భార్య కొడుకును పిలుచుకుని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య, కొడుకును ఇంటికి పిలుచుకురావాలని టెక్కీ మనీష్ భండారి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు.

 నో చెప్పిన భార్య

నో చెప్పిన భార్య

భర్త మనీష్ భండారి ఎంత ప్రయత్నించిన అతని భార్య మాత్రం భర్తతో కాపురం చెయ్యడానికి అంగీకరించకుండా ఆమె పుట్టింటిలోనే మకాం వేసింది. కొంతకాలం క్రితం మనీష్ భండారికి ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి మనీష్ భండారి ఇంకా ఆవేదనకు గురైనాడని తెలిసింది. భర్త, కొడుకు దూరం కావడం, ఉద్యోగం పోవడంతో మనీష్ భండారికి పిచ్చిపట్టినట్లు అయ్యింది.

 నీ భార్య.... నీ ఇష్టం అని చెప్పిన తల్లి

నీ భార్య.... నీ ఇష్టం అని చెప్పిన తల్లి

రాత్రి 9 గంటల సమయంలో వాకింగ్ పూర్తి చేసుకుని వెలుతున్న మీనా కుమారి, రణబీర్ కుమార్ దంపతులకు మార్గం మద్యలో వాళ్ల కొడుకు మనీష్ భండారి ఎదురు వచ్చాడు. నువ్వు నీ కొడుకుతో మాట్లాడి ఇంటికి రా అంటూ రణబీర్ కుమార్ ఆయన భార్య మీనా కుమారికి చెప్పాడు. భర్త వెళ్లి పోవడంతో మీనా కుమారి శివపురిలోని పార్క్ సమీపంలో నిలబడి కొడుకు మనీష్ భండారితో మాట్లాడుతోంది. ఆ సమయంలో తన భార్యను పిలుచుకుని రావాలని మనీష్ భండారి అతని తల్లికి చెప్పాడు. నీ భార్య అంటా, నువ్వు అంటా ఎక్కడైనా తగలడండి, మధ్యలో నన్ను లాగకూడదని మీనా కుమారి ఆమె కొడుక్కి తేల్చి చెప్పారు.

 తల్లిని దారుణంగా చంపేసిన కొడుకు

తల్లిని దారుణంగా చంపేసిన కొడుకు

తల్లి మీనా కుమారి అలా చెప్పడంతో ఆమె కొడుకు మనీష్ భండారి సహనం కోల్పోయాడు. ఆ సందర్బంలో టెక్కీ మనీష్ భండారి అతని భార్య విషయం గురించి అతని తల్లి మీనా కుమారితో గట్టిగా వాదించాడు. ఆ సమయంలో సహనం కోల్పోయిన టెక్కీ మనీష్ భండారి అతని కన్న తల్లి మీనా కుమారిని రోడ్డు మీదకు తోసేసి కాళ్లతో తన్నుతూ కత్తి తీసుకుని ఇష్టం వచ్చినట్లు పొడవడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోవడం కలకలం రేపింది.

 సీసీటీవీల్లో ?.......టెక్కీకి 70 ఎంఎం సినిమా

సీసీటీవీల్లో ?.......టెక్కీకి 70 ఎంఎం సినిమా

మీనా కుమారి భర్త రణబీర్ కుమార్ అక్కడికి వెళ్లే సమయానికి ఆమెను చంపేసిన మనీష్ భండారి పరారైనాడని, తల్లిని హత్య చేస్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని, టెక్కీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి రాజీవ్ దేశ్వాల్ మీడియాకు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+