Wife: పిల్లలు పుట్టలేదని మంత్రగాడితో పూజలు, మూడు రోజులు హోటల్ లో భార్యతో ?, రచ్చరచ్చ !
అహమ్మదాబాద్/చెన్నై: తల్లిదండ్రులు చూపించిన యువకుడిని వివాహం చేసుకున్న యువతి అతనితో చక్కగా సంసారం చేస్తోంది. వివాహం జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా సంతానం కలగకపోవడంతో యవతి, యువకుడి కుటుంబ సభ్యులు దంపతులకు అనేక ఆసుపత్రుల్లో చూపించారు. ఎన్ని చోట్ల చూపించినా పిల్లలు పుట్టకపోవడంతో అబ్బాయి కుటుంబ సభ్యులు కోడలిని సూటిపోటి మాటలు మాట్లాడారు. వివాహం జరిగి 8 సంవత్సరాలు పూర్తి అయిపోవడంతో చివరికి భార్యను ఓ మత్రగాడి దగ్గర చూపించి నాటు వైద్యం చేయించాలని భర్త కుటుంబ సభ్యులు అనుకున్నారు. మంత్రగాడు కేటుగాడు అని తెలీక అతని దగ్గరకు వెళ్లారు. భర్తను బయటకు పంపించిన మంత్రగాడు నువ్వు నాతో హోటల్ లో మూడు రాత్రులు గడిపితే పిల్లలు పుట్టే అవకాశం ఉందని ఆమెకు మాయమాటలు చెప్పాడు. మంత్రగాడి మాటలతో మండిపోయిన మహిళ ఆ విషయం భర్తకు చెప్పడంతో రచ్చ రచ్చ అయ్యింది.

ఇంట్లో చూసిన అబ్బాయితో పెళ్లి
గుజరాత్ లోని అహమ్మదాబాద్ సమీపంలో రెహమాన్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అహమ్మదాబాద్ జిల్లాలోనే రేష్మా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. 8 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు చూపించిన రెహమాన్ ను వివాహం చేసుకున్న రేష్మా అతనితో చక్కగా సంసారం చేస్తోంది.

పిల్లలు పుట్టకపోవడంతో సూటిపోటి మాటలు
వివాహం జరిగి 8 సంవత్సరాలు గడిచిపోతున్నా రెహమాన్, రేష్మా దంపతులకు సంతానం కలగకపోవడంతో అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు దంపతులకు అనేక ఆసుపత్రుల్లో చూపించారు. ఎన్ని చోట్ల చూపించినా రేష్మాకు పిల్లలు పుట్టకపోవడంతో రెహమాన్ కుటుంబ సభ్యులు కోడలు రేష్మాను సూటిపోటి మాటలు మాట్లాడారు.

మంత్రగాడు ఎంట్రీ
వివాహం జరిగి 8 సంవత్సరాలు పూర్తి అయిపోవడంతో చివరికి భార్య రేష్మాను మత్రగాడు ఇమ్తియాజ్ దగ్గరకు పిలుచుకుని వెళ్లి ఆమెకు నాటు వైద్యం చేయించాలని భర్త రెహమాన్ కుటుంబ సభ్యులు అనుకున్నారు. మంత్రగాడు ఇమ్తియాజ్ కేటుగాడు అని తెలీక అతని దగ్గరకు రేష్మాను పిలుచుకుని వెళ్లారు. భర్త రెహమాన్ ను బయటకు పంపించిన మంత్రగాడు ఇమ్తియాజ్ రేష్మాకు ఏవేవో మంత్రాలు వేశాడు.

డైరెక్టుగా ఇంటికే వెళ్లాడు..... వైఫ్ షేరింగ్ స్కెచ్
పిల్లలు పుట్టడానికి సహాయం చేస్తానని మంత్రగాడు ఇమ్తియాజ్ భర్త రెహమాన్ కు చెప్పాడు. నేరుగా రెహమాన్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. భర్త రెహమాన్ ను బయటకు పంపించిన మంత్రగాడు నువ్వు వేరే వ్యక్తితో మూడు రాత్రులు గడిపితే పిల్లలు పుట్టే అవకాశం ఉందని భార్యకు మాయమాటలు చెప్పాడు. నాతో పాటు మూడు రాత్రులు హోటల్ లో ఉండటానికి నువ్వు అంగీకరించాలని మంత్రగాడు ఇమ్తియాజ్ పిల్లలు పుట్టకుండా ఏడుస్తున్న రేష్మాకు చెప్పాడు. ఇప్పుడు వైఫ్ షేరింగ్ తప్పా వేరే మార్గం లేదని మంత్రగాడు ఇమ్తియాజ్ రెచ్చిపోయాడు.

భర్తను చితకబాదని మంత్రగాడి ఫ్యామిలీ
మంత్రగాడు ఇమ్తియాజ్ తనతో ఎంజాయ్ చెయ్యడానికి హోటల్ కు రమ్మని చెబుతున్నాడని రేష్మా ఆమె భర్త రెహమాన్ కు చెప్పడంతో రచ్చ రచ్చ అయ్యింది. ఇటు వైపు ఇంకోసారి వస్తే నీ అంతు చూస్తామని ఇమ్తియాజ్ ను అక్కడి నుంచి పంపించేశారు. తరువాత ఇమ్తియాజ్ మీద రేష్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా ఇమ్తియాజ్ ను వదిలేశారు. తన మీద కేసు పెట్టారని తెలుసుకున్న ఇమ్తియాజ్ అతని ముగ్గురు సోదరులను వెంటపెట్టుకుని వెళ్లి రెహమాన్ ను పట్టుకుని చితకబాదేశారు.

మంత్రగాడు మాయం
నేను కేసు పెట్టినా పట్టించుకోకపోవడం వలనే తన భర్త రెహమాన్ మీద మంత్రగాడు ఇమ్తియాజ్, అతని సోదరులు దాడి చేశారని రేష్మా పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇమ్తియాజ్ అతని సోదరులు తప్పించుకుని పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications