గుడ్ న్యూస్ చెప్పిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతోనే కాకుండా తన సామాజిక సేవా కార్యక్రమాలతోనూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. తాజాగా ఆయన వార్తల్లో నిలిచారు. తన తండ్రి పుట్టి పెరిగిన ఊరైన అచ్చంపేట్ మండలం తుమ్మన్‌పేట గ్రామానికి స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రయాణం అయ్యారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందించనున్నారు.
ది దేవరకొండ ఫౌండేషన్ తరఫున ఈ ఆర్థిక సహాయానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 180 మంది విద్యార్థులను సన్మానించనున్నారీ స్టార్ కపుల్. దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్, హైదరాబాద్ నుంచి తుమ్మన్ పేట్ కు బయలుదేరి వెళ్లిన ఫొటోను విజయ్ దేవరకొండ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్మిక మందన్నతో కలిసి విజయ్ దేవరకొండ ఒక ప్రత్యేకమైన వినూత్న విద్యా కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

అచ్చంపేట మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లలో 9, 10వ తరగతి వరకు చదివి మంచి గ్రేడ్ తెచ్చుకున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తామని విజయ్ దేవరకొండ అప్పట్లో ప్రకటించారు. దీన్ని నిజం చేస్తోన్నారు. కష్టపడి చదువుతూ విద్యా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులను గుర్తించి వారికి తగిన తోడ్పాటు అందించాలని వీరిద్దరు నిర్ణయించుకున్నారు అప్పట్లో. దీనికి అనుగుణంగా నేడు ఎంపికైన 180 మందికీ స్కాలర్ షిప్ లను అందించనున్నారు.
We are on our way to Thummanpet.
— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026
The little village where my Father was born.
In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours.
To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana.
Here is a… pic.twitter.com/wLNSr4ZZHe
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ రావు స్వగ్రామం.. తుమ్మన్‌పేట్. ఆయన అక్కడే చదువుకున్నారు. అందుకే తమ మూలాలు ఉన్న సొంత ఊరిలోని విద్యార్థులకు మేలు చేయాలనే గొప్ప ఉద్దేశంతో దేవరకొండ ఈ సరికొత్త విద్యా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి జన్మస్థలానికి వెళ్లడం, పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు నిజమైన గర్వకారణంగా నిలిచిన ప్రతిభ గల విద్యార్థులను సన్మానించడం భావోద్వేగంతో కూడిన అనుభూతిని ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ విద్యా పురస్కారాల ప్రదానోత్సవాన్ని గ్రామీణ ప్రాంతాలలో పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఉపయోగపడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. పల్లెటూరి పిల్లలకు నాణ్యమైన చదువు అందాలనే ఆకాంక్షతో రశ్మిక, విజయ్ దేవరకొండ ఉమ్మడిగా ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications