బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీకి అనర్హత ఎమ్మెల్యేల షాక్, సిద్దూ రాజీ రాగం, కథ క్లైమాక్స్, కాంగ్రెస్ లో ఉంటాం?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు కలకలం మొదలైయ్యింది. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి పోయి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన రెబల్ ఎమ్మెల్యేలు అనర్హతకు గురైనారు. అనర్హత ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో ఇప్పుడు ఉప ఎన్నికల వేడి మొదలైయ్యింది. అనర్హత ఎమ్మెల్యేలు అందరికీ బీజేపీ టిక్కెట్లు దాదాపు ఖరారు అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లకుండా తాము కాంగ్రెస్ లోనే ఉంటామని వారి సన్నిహితులు దగ్గర చెప్పడంతో ఇప్పుడు బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య రాజీ రాగం పాడుతున్నారు.

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్: 104 నాటౌట్, చివరికి డెలివరి బాయ్ చిక్కాడు, అక్కడే ఫైన్ !ట్రాఫిక్ రూల్స్ బ్రేక్: 104 నాటౌట్, చివరికి డెలివరి బాయ్ చిక్కాడు, అక్కడే ఫైన్ !

బీజేపీ లీడర్స్ దెబ్బ

బీజేపీ లీడర్స్ దెబ్బ

అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి ఆ పార్టీ నాయకులు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలోకి అనర్హత ఎమ్మెల్యేలు వస్తే మాకు రాజకీయంగా దెబ్బ పడుతుందని కొందరు బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అయితే సీఎం యడియూరప్ప మాత్రం అనర్హత ఎమ్మెల్యేలకే ఉప ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు.

సమయం కావాలి

సమయం కావాలి

కర్ణాటక సీఎం యడియూరప్ప ఇచ్చిన బంపర్ పరిశీలిస్తున్న అనర్హత ఎమ్మెల్యేలు మేము మా కుటుంబ సభ్యుతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని, అందుకు సమయం కావాలని అంటున్నారు. ఇదే సమయంలో కొందరు అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని నిర్ణయించారని ప్రచారం జరగడంతో తీవ్రచర్చకు దారి తీసింది.

15 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు

15 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు

సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం అయిన అనర్హత ఎమ్మెల్యేలకు చెందిన 15 నియోజక వర్గాల్లో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల తేదీని ఇప్పటికే ప్రకటించింది. సుప్రీం కోర్టులో అనర్హత ఎమ్మెల్యేల అర్జీ విచారణ పూర్తి అయిన తరువాత అందరూ బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేస్తారని బీఎస్. యడియూరప్ప ధీమాగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొందురు అనర్హత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోనే ఉండాలనే వార్త బయటకు రావడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.

కాంగ్రెస్ స్వాగతం

కాంగ్రెస్ స్వాగతం

ఎవ్వరైనా సరే, ఎవరు కావాలనుకున్నా సరే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశం ఉందని, అయితే మా పార్టీ సిద్దాంతాలు, షరతులు అంగీకరించాలని అనర్హత ఎమ్మెల్యేలకు బహిరంగంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆఫర్ ఇచ్చారు. అయితే అనర్హత ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే విషయం నా చేతుల్లో లేదని, అది హైకమాండ్ చూసుకుంటుందని సిద్దరామయ్య అంటున్నారు. అనర్హత ఎమ్మెల్యేలు కొందరు తనను సంప్రదించారని, వారు కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడానికి సిద్దంగా ఉన్నారని మాజీ సీఎం సిద్దరామయ్య బాంబు పేల్చారు.

బీజేపీ లీడర్స్ టచ్ లో ఉన్నారు

బీజేపీ లీడర్స్ టచ్ లో ఉన్నారు

ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు రాని వారు మా పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని, ఇప్పటికే హైకాండ్ తో కొందరు నాయకులు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు రమేష్ జారకిహోళి (అనర్హత ఎమ్మెల్యే)తో తనకు ముందు నుంచి అభిప్రాయ విభేదాలు ఉన్నాయని, ఇద్దరి దారులు వేరు అనే విషయం ప్రజలకు తెలుసని సతీష్ జారకిహోళి అన్నారు. అయితే అనర్హత ఎమ్మెల్యేలు చాల మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని, త్వరలో అన్ని వివరాలు చెబుతామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సతీష్ జారకిహోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
Karnataka: There is information available that some Disqualified mlas, who see the political developments on a daily basis, have decided to stay in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X