వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణం పోయే వరకు‘చిన్నమ్మ’పై పోరాటం చేస్తా: శశికళ పుష్ప

జయలలిత నెచ్చెలి శశికళ నటరాజ్ ఎలా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారని, అలా జరగడానికి వీలులేదని, నా ప్రాణం పోయే వరకు శశికళ (చిన్నమ్మ) మీద పోరాటం .

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత నెచ్చెలి శశికళ నటరాజ్ ఎలా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటారని, అలా జరగడానికి వీలులేదని, నా ప్రాణం పోయే వరకు శశికళ (చిన్నమ్మ) మీద పోరాటం చేస్తానని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప చాలెంజ్ చేశారు.

చెన్నైలో శశికళ పుష్ప మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప ఇప్పుడు చిన్నమ్మ శశికళ నటరాజన్ మీద మండిపడుతున్నారు. అసలు శశికళ నటరాజన్ కు కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేదని శశికళ పుష్ప ఆరోపించారు.

పార్టీలో సభ్యత్వం లేని ఆమెకు ప్రధాన కార్యదర్శిగా ఎలా భాద్యతలు అప్పగిస్తారని పార్టీ సీనియర్లను ప్రశ్నించారు. శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు తీసుకున్న తరువాత ఆ పార్టీని ఆమె భర్త నటరాజన్ నడిపిస్తాడని, అందులో ఎలాంటి డౌట్ లేదని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు.

జయలలిత ఆత్మ'ప్రేతాత్మ'అయ్యి తిరుగుతుందంట

Will fight till last breath against Sasikala Natarajan’s elevation: MP Sasikala Pushpa

శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి పార్టీ సీనియర్లు మద్దతు ఇచ్చారా ? అని ఆమె ప్రశ్నించారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం శశికళకు మద్దతు ఇచ్చారా ? అని ప్రశ్నించారు.

అన్నాడీఎంకే పార్టీలోని సీనియర్లను శశికళ నటరాజన్ కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని, అందుకే వారు పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలను తాను అడ్డుకుంటానని అన్నారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని తాను మనవి చేస్తానని అన్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకుని సీనియర్లకే ఆ పదవి వచ్చేలా చెయ్యాలని, శశికళ నటరాజన్ కుట్రలను అడ్డుకోవాలని శశికళ పుష్ప మనవి చేశారు.

జయలలితకు శశికళ 35 సంవత్సరాలు సేవ చేశారని కొందరు అంటున్నారని, అందుకే అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శి పదవి ఇస్తున్నారని కొందరు చెబుతున్నారని ఎంపీ శశికళ పుష్ప గుర్తు చేశారు.

మా ఇంటిలో గత 25 సంవత్సరాల నుంచి ఒకరు పని చేస్తున్నారని, నా సౌకర్యాలు అన్నీ చూసుకుంటున్నారని, అందుకోసం నా పదవి నా పనిమనిషికి ఇవ్వమంటే ఏలా కుదురుతుంది అని ప్రశ్నించారు. శశికళ నటరాజన్ జయలలితకు పని మనిషిగా పని చేశారని పరోక్షంగా చెప్పారు.

Will fight till last breath against Sasikala Natarajan’s elevation: MP Sasikala Pushpa

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఉండటానికి ఆ పార్టీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు అంగీకరించరని ఎంపీ శశికళ పుష్ప జోస్యం చెప్పారు. శశికళ నటరాజన్ చేతికి పగ్గాలు ఇస్తే వారి కుటుంబ సభ్యులను రాజ్యసభలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తారని ఆరోపించారు.

ఇప్పటికైన పార్టీ లీడర్లు జోక్యం చేసుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకుని కార్యకర్తలకు అండగా నిలవాలని ఎంపీ శశికళ పుష్ప మనవి చేశారు. అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సి. పొన్నియన్ ఇటీవల మీడియాతో మాట్లాడారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్లు పోటీ పడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. పార్టీ ఏకతాటిపై నిర్ణయం తీసుకుని ఎలాంటి పోటీ లేకుండా ఒక్కరినే పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని అన్నారు. శశికళనే పార్టీ పగ్గాలు చేపడుతారని పరోక్షంగా చెప్పారు.

English summary
AIADMK members met Sasikala Natarajan to convince her to take charge, expelled lawmaker Sasikala Pushpa said that she would fight till her last breath to ensure that former chief minister J Jayalalithaa's confidante doesn't become the party general secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X