ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్: జయలలిత చికిత్స ఫోటోలు, వీడియోలు, శశికళ ఫ్యామిలీకి ఝలక్!

Posted By:
Subscribe to Oneindia Telugu
IT raids at Sasikala's Associates Continues | oneindia Telugu

చెన్నై: శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు మరో ఝలక్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. శశికళ కుటుంబ సభ్యుల అందరి ఇళ్లలో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళకు ఊహించని షాక్ ఇవ్వాలని నిర్ణయించారు.

ఐటీ అధికారులకు షాక్: దినకరన్ ఫాంహౌస్ లో సీక్రెట్ గదులు, లాక్ నెంబర్లు గుర్తులేవు, సీజ్!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స చేస్తున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశామని చెప్పిన శశికళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు ఎక్కడ ఉన్నాయి అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Will IT officials get Jayalalithaas hospital photos and videos

ఇప్పటికే శశికళ ఫ్యామిలీకి చెందిన రూ. వందల కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఐటీ శాఖ అధికారులు జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించాలని సిద్దం అయ్యారని తెలిసింది. వివేక్ ఇంటిలోనే ఫోటోలు, వీడియో ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మోడీ, పళని ప్లాన్: రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే ఐటీ దాడులు, జైలు కొత్తకాదు, దినకరన్!

అమ్మ జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీశామని టీటీవీ దినకరన్, శశికళ సోదరుడు జయరామన్ కుమారుడు వివేక్ చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు బయటపడితే శశికళ కుటుంబ సభ్యులు ఇంకో సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Is Incometax officials searching the photograph and videos of Jayalalitha at Apollo hospital as Sasikala family claiming that they heve evidence that Jayalalitha is alright at hospital while at treatment.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి