శశికళతో భేటీ అవుతాం: అన్నాడీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యే, అదే జరిగితే పెరోల్ రద్దు గ్యారెంటీ !

అన్నాడీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు త్వరలో శశికళను కలవడానికి సిద్దం అవుతున్నారు.

చెన్నై: అన్నాడీఎంకే మిత్రపక్ష ఎమ్మెల్యేలు త్వరలో శశికళను కలవడానికి సిద్దం అవుతున్నారు. ఇంత కాలం పళనిసామి, టీటీటీ దినకరన్ వర్గాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తూ వస్తున్న అన్నాడీఎంకే పార్టీ మిత్రపక్ష ఎమ్మెల్యేలు ముగ్గురు త్వరలో శశికళతో భేటీ అవుతామని అంటున్నారు.

శనివారం అన్నాడీఎంకే పార్టీ మిత్రపక్ష ఎమ్మెల్యే తనియరసు మీడియాతో మాట్లాడుతూ జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళను కలుస్తామని స్పష్టం చేశారు. సినీ నటుడు, ఎమ్మెల్యే కరుణాస్, మరో ఎమ్మెల్యేతో కలిసి చిన్నమ్మ శశికళను కలిసి తమ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తామని ఎమ్మెల్యే తనియరసు చెప్పారు.

Will meet Sasikala soon, says MLA Thaniyarasu

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గానికి మీరు మద్దతు ఇవ్వరా ? అని మీడియా ప్రశ్నిస్తే ఇప్పుడే కదా శశికళను కలుస్తామని చెప్పాం అంటూ ఆయన మీడియానే ఎదురు ప్రశ్నించారు. మొత్తం మీద ఐదు రోజులు పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. శశికళ రాజకీయాల గురించి చర్చించినా, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడినా ఆమె పెరోల్ రద్దు అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+