ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ రాజ్యసభలో పాస్అయితే సుప్రీంను ఆశ్రయిస్తా: ఏఐఎంపీఎల్‌బీ

లక్నో: షరియత్‌కు వ్యతిరేకంగా ఉండే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో రాజ్యసభలో ప్రవేశపెడితే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది ఆల్ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు. సెప్టెంబర్ 19వ తేదీన కేంద్ర మంత్రి వర్గం ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు.

కొన్ని వందల ఏళ్ల నుంచి అనాదిగా వస్తున్న ట్రిపుల్ తలాక్ పద్దతికి స్వస్తి చెప్పాలని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగష్టులో తీర్పు వెల్లడించింది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ అని చెబితే ఆమెతో విడాకులు పొందినట్లుగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ట్రిపుల్ తలాక్ చెబితే వారికి మూడేళ్లు జైలుశిక్ష విధించడం జరుగుతుందని ఇకపై ట్రిపుల్ తలాక్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకువచ్చింది. అదే సమయంలో బెయిల్‌ కూడా పొందొచ్చంటూ చట్టంలో పేర్కొంది.

Will move Supreme Court if triple talaq ordinance is passed in Rajya Sabha: AIMPLB

సాధారణంగా ఆర్డినెన్స్ పాస్ అయ్యేందుకు నిర్ణీత గడువుంటుందని ఆ గడువులోగా బిల్లు పాస్ కాకుంటే దానికి ప్రాధాన్యత ఉండదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు సయ్యద్ ఖాసిం రసూల్ చెప్పారు. ఒకవేళ బిల్లు పాస్ అయితే... తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇది కేవలం షరియత్‌కు వ్యతిరేకమే కాదు.. ముస్లిం మహిళలకు కూడా వ్యతిరేకంగా ఉన్న బిల్లు అని చెప్పారు. ముస్లిం మహిళలే ఈ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పిన సభ్యులు... కొన్ని లౌకిక పార్టీల అధినేతలను కలిసి ఆర్డినెన్స్ పాస్ కాకుండా చూడాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

ఇక అయోధ్యపై మాట్లాడిన సభ్యులు సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పే అంతిమంగా భావిస్తామని చెప్పారు. తీర్పు చెప్పేవరకు అయోధ్యపై ఎవరూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని అలా అని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+