దేశంలో బీజేపీకి ఎదురుగాలి.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు కుట్ర.. చత్తీస్‌ఘడ్ సీఎం కీలక వ్యాఖ్యలు
దేశంలో ఒకవైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దడపుట్టిస్తోంది. రోజు రోజుకు కేసుల నమోదు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్థత నెలకొంది. వైరస్ సాకును చూపి ఈ ఎన్నికలను వాయిదా వేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని చత్తీస్‌ఘడ్ సీఎం భూపేస్ బాఘెల్ ఆరోపించారు.

1ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వాయిదాకు కుట్ర
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వాటిని వాయిదా వేసేలా బీజేపీ కుట్ర చేస్తోందని చత్తీస్‌ఘడ్ సీఎం భూపేస్ బాఘేల్ అనుమానం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ వైరస్ సాకు చూపే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రధాని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈసీ పాల్గొనడంపై ఆయన తప్పుపట్టారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నించారు.

ప్రజల్లో మోదీపై వ్యతిరేకత
దేశంవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా సర్వేలు వెలువడుతుండడంతో మోదీకి భయంపట్టుకుందని విమర్శించారు.
వచ్చే ఏడాది ఆరంభంలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరనున్న నేపథ్యంలో కరోనా పరిస్ధితిపై ఎన్నికల కమిషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో సమావేశమైంది. ఈ నేపధ్యంలో చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాఘేల్ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేశారు.

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు.?
ఒమిక్రాన్ కొత్తవేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్థత నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖతో సమావేశం కావడంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని సీఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న మరో సారి కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో కేంద్ర ఎన్నిక సంఘం సమావేశం కానుంది.

ఎన్నికల వాయిదాపై అలహాబాద్ హైకోర్టు సూచనలు
మరో వైపు ఇటీవల అలహాబాద్ హైకోర్టు కూడా అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి, ప్రధాని నరేంద్ర మోదీకి సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి పెరుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను మరో రెండు నెలలు వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని తెలిపింది. కరోనా ఆంక్షలను అమలు చేయాలని చెప్పింది. ర్యాలీలు, బహిరంగ సభలు, రాజకీయ వేడుకలపైనా నిషేధం విధించాలని హైకోర్టు తెలిపింది.












Click it and Unblock the Notifications