తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చమురు మంట-కేంద్రం సూచన బేఖాతర్-వ్యాట్ పై జగన్, కేసీఆర్ మౌనం
దీపావళి కానుకగా కేంద్రం చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిన్న కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో కొన్నేళ్లుగా చమురు ధరల మంటతో అల్లాడుతున్న వినియోగదారులకు భారీ ఊరట దక్కినట్లయింది. అయితే అదే కోవలో రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించింది. కానీ ఈ సూచనను బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే పాటిస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు మిగతా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు మాత్రం మౌనం వహిస్తున్నాయి. దీంతో ఆయారాష్ట్రాల్లో చమురు మంట కొనసాగబోతోంది.
Recommended Video

కేంద్రం దీపావళి కానుక
దేశవ్యాప్తంగా చమురు ధరల మంటతో అల్లాడుతున్న వినియోగదారులకు కేంద్రం దీపావళి కానుక ఇచ్చింది. చమురు ధరలపై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రోల్ పై కనీసం రూ.5, డీజిల్ పై కనీసం రూ.10 మేర ధరలు తగ్గాయి. కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కానీ తగ్గడం తెలియని జనానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం భారీ ఊరటనిస్తోంది. ముఖ్యంగా చమురు ఉత్పత్తుల ధరలు లీటరుకు వంద రూపాయలు దాటేసినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భావిస్తున్న వారికి దీపావళి కానుక ఎంతో సంతోషాన్నిచ్చింది.

రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలన్న కేంద్రం
దీపావళి కానుకగా చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. అదే బాటలో రాష్ట్రాలు కూడా్ తమ వ్యాట్ సుంకాన్ని తగ్గించాలని కోరింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే బాట పట్టాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూపీ గరిష్టంగా లీటరుపై రూ.12 రూపాయల మేర వ్యాట్ తగ్గించేసింది. హిమాచల్ ప్రదేశ్ కనిష్టంగా రూ.2 తగ్గించింది. దీంతో ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో వినియోగదారులకు ఊరట దక్కింది. కానీ బీజేపీయేతర రాష్టాలు మాత్రం కేంద్రం సూచనను పట్టించుకోలేదు. దీంతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా పార్టీలపై ఒత్తిడి పెరుగుతోంది.

బీజేపీయేతర రాష్ట్రాల మౌనం
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఎక్సైజ్ సుంకం తగ్గి చమురు ధరలు దిగొస్తున్నాయి. అయితే ఇదే సమయంలో రాష్ట్రాలు కూడా వ్యాట్ లో ఎంతో కొంత తగ్గించుకుంటే ధరలు మరింత తగ్గే అవకాశముంది. కానీ బీజేపీయేర రాష్ట్రాలు మాత్రం కేంద్రం సూచనను పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు పలు బీజేపీయేతర పాలిత రాష్టాల్లో వ్యాట్ తగ్గింపుపై ప్రభుత్వాల మౌనం కొనసాగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో వినియోగదారులు, విపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయితే వ్యాట్ స్ధానంలో భవిష్యత్తులో చమురు ఉత్పత్తులపై జీఎస్టీ విధించే అవకాశం ఉండటంతో ఆయా రాష్ట్రాలు మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యాట్ తగ్గింపుపై జగన్, కేసీఆర్ మౌనం
పెట్రోల్, డీజిల్ సహా ఇతర చమురు ఉత్పత్తులపై ధరలు పెంచాల్సి వచ్చినప్పుడు గతంలో కేంద్రంతో పోటీ పడి మరీ ధరలు పెంచిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినా తమ పరిధిలో ఉన్న వ్యాట్ ను తగ్గించేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికే కరోనా కారణంగా భారీగా ఆదాయం కోల్పోయామని భావిస్తున్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు వ్యాట్ తగ్గింపుతో మరింత నష్టపోతామని చెప్తున్నాయి. కేంద్రం ఎలాగో ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో చమురు ధరలు కాస్త దిగొచ్చాయి. అయినా లీటరుకు వందలోపుకు మాత్రం రాలేదు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే మాత్రం లీటరు పెట్రోల్, డీజిల్ ధర వందలోపుకు రావడం ఖాయం. ఆ దిశగా ఇప్పటికైనా నిర్ణయాలు తీసుకోవాలని జగన్, కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications