వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికొందరు రాజీనామా చేస్తారు.. రెండురోజుల్లో భవిష్యత్ కార్యాచరణ : యడ్యూరప్ప

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : నిమిష, నిమిషానికి కర్ణాటక రాజకీయ మారిపోతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుండగా .. తమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతుంది బీజేపీ. ప్రస్తుత పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్న కమళదళం .. అదనుకోసం వేచి చూస్తోంది. అతేకాదు కర్ణాటక రాజకీయ రసకందాయంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టంచేసింది. తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యేలు నేతల వైఖరితో విసుగుచెంది రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టు కొత్త భాష్యం చెప్తున్నారు.

విసుగుచెంది ..?
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో తమకేం సంబంధం లేదని బీజేపీ చెప్తుంది. సీఎం, డిప్యూటీ సీఎం, నేతల వైఖరితో ఎమ్మెల్యేలు విసుగుచెంది ఉంటారని గుర్తుచేస్తుంది. అంతేకాదు రానున్న రోజుల్లో మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని మాజీ సీఎం, కర్ణాటక బీజేపీ చీప్ యడ్యూరప్ప తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాకు .. ఆ పార్టీ అధినేతల వైఖరి కారణమని గుర్తుచేశారు.

Will wait for more MLAs to resign, says Yeddyurappa, denies role in Karnataka crisis

ఇక్కడే ఉన్నారే ...
యడ్యూరప్ప పీఏ సంతోష్ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను తరలించారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే అదేం లేదని తోసిపుచ్చారు యడ్యూరప్ప. అసత్య వార్తలను నమ్మొద్దని సూచించారు. 4 రోజుల నుంచి సంతోష్ బెంగళూరులో ఉన్నాడని స్పష్టంచేశారు. కానీ కొందరు రెబల్ ఎమ్మెల్యేలను ముంబై తరలించారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీ రోల్ ఏంటీ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. మరో రెండురోజులు వేచి చూస్తామని పేర్కొన్నారు.

ఈ సమయంలో మరికొంత మంది ఎమ్మెల్యేలు చేజారుతురాని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే .. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో స్పీకర్ కూడా రాజీనామాలను ఆమోదించాలని కోరారు. తదుపరి సీఎం యడ్యూరప్పను మీరేనా అని ప్రశ్నిస్తే .. బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తప్పించుకున్నారు.

English summary
as the Karnataka coalition battles yet another crisis with the resignations of 13 MLAs, BJP has steered clear of the blame of orchestrating this crisis. However, speaking to India Today TV, former CM and Karnataka BJP president BS Yeddyurappa also said that he is expecting more MLAs to quit and soon BJP will decide the future course of action. "My PA Santosh is very much in Bangalore for the last 3-4 days and it is absolutely baseless to say that he is receiving the rebel MLAs at the Mumbai hotel," Yeddyurappa told India Today TV. He added, "JDS and Congress MLAs are resigning because they are fed up of the government and we have absolutely nothing to do with it."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X