వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెడి(ఎస్), కాంగ్రెస్ గురించి మాట్లాడడం ఇష్టం లేదు: యడ్యూరప్ప

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడైన తర్వాత భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తామని మాజీ సీఎం, బిజెపి నేత యడ్యూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్ , జెడి(ఎస్) మధ్య పొత్తు గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పారు.

మంగళవారం నాడు ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో యడ్యూరప్పమీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత భవిష్యత్ ప్రణాళికను రచిస్తామని చెప్పారు. పార్టీ జాతీయ నాయకులతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ప్రకటించారు.

Will wait for the last vote to be counted: BS Yeddyurappa on Congress-JDS alliance talks in Karnataka

తమ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప కూడా ఈ సాయంత్రమే గవర్నర్‌ను కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్ అపాయింట్ మెంట్ ను బిజెపి నేతలు కోరారు. సాయంత్రం యడ్యూరప్ప గవర్నర్ ను కలిసే అవకాశం లేకపోలేదు.

జేడీఎస్ అధినేత కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కాంగ్రెస్ ప్రతిపాదనను పంపింది. ఈ మేరకు జేడీఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్‌ పరమేశ్వర ప్రకటించారు. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప ఢిల్లీ పయనం వాయిదా పడినట్లు సమాచారం.

English summary
BJP's chief ministerial candidate BS Yeddyurappa was on Tuesday said that he will wait for the last vote to be counted before commenting on the party's future strategy for Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X