జయ ఆరోగ్యం: బులిటెన్ విడుదలై వారం అయ్యింది

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోంటున్నారని వైద్యులు శుభవార్త చెబుతారని ఆమె అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. జయలలిత ఆసుపత్రిలో చేరి మూడువారాలకు పైగా అయ్యింది.

గత ఏడు రోజుల నుంచి జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి బులిటెన్ విడుదల కాకపోవడంతో కొందరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రపంచంలోని ప్రఖ్యాత వైద్యులు జయలలితకు వైద్యం చేస్తున్నారు.

24 గంటలు అక్కడే

24 గంటలు అక్కడే

అపోలో ఆసుపత్రి బయట అభిమానుల ఆందోళనలు మాత్రం అలాగే ఉన్నాయి. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆసుపత్రి ఎదుట ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు 24 గంటలు అక్కడే వేచి ఉన్నారు.

కేసులు పెడుతాం జాగ్రత్త

కేసులు పెడుతాం జాగ్రత్త

జయలలిత ఆరోగ్యంపై ఎవరైనా పుకార్లు సృష్టించినా, వ్యతిరేకంగా ఆరోపణలు చేసినా చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. గతవారంలో ఓ టీవీ చానల్ లో ప్రసారం అయిన క్లిప్పింగ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమ్మ మీద ప్రేమతో

అమ్మ మీద ప్రేమతో

ఓ వ్యక్తి స్టీల్ వైర్లతో తన శరీరాన్ని తల్లకిందలుగా వేలాడదీసుకుని అమ్మ కోసం ప్రార్థనలు చేశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని వేడుకుంటూ రోడ్ల మీద ప్రదర్శనగా వెళ్లాడు. మదురైలో ఇరులంది (68) అనే ఆయన ముళ్ల పాన్పు మీద 24 గంటలు పడుకుని అమ్మ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అమ్మ అంటే ప్రాణం

అమ్మ అంటే ప్రాణం

విషపూరిత ముళ్లతో సహ ఐదు రకాల ముళ్లతో ఇరులంది ప్రత్యేకంగా ముళ్ల పాన్పును తనే తయారు చేసుకుని అమ్మ కోసం తనకు ఇష్టం అయిన పెచ్చియమ్మాన్ దేవతకు పూజలు చేసి తన భక్తిని చాటుకున్నారు.

డీఎంకే కార్యకర్తలపై కేసులు

డీఎంకే కార్యకర్తలపై కేసులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పుకార్లు సృష్టించారని ఆరోపిస్తు ఇప్పటి వరకు అనేక పార్టీల నాయకులు, కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. అందులో డీఎంకే కార్యకర్తల మీదే ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయి.

చెన్నైలో ప్రత్యేక పూజలు

చెన్నైలో ప్రత్యేక పూజలు

జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నైలోని ఆర్ కే నగర్ లో అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. పూజలలో భాగంగా 20 మంది పిల్లలు బుగ్గలకు శూలాలు కుచ్చుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు.

పీఎంకే రాందాస్

పీఎంకే రాందాస్

ఈ విషయం గుర్తించి పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ రామదాస్ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. 5 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలతో బలవంతంగా బుగ్గలకు శూలాలు గుచ్చి నడి రోడ్డు మీద ఊరేగింపుగా తీసుకు వెళ్లిన అన్నాడీఎంకే నాయకుల మీద కేసులు నమోదు చెయ్యాలని మానవహక్కుల సంఘానికి మనవి చేశారు.

జయలలిత జీవిత చరిత్ర

జయలలిత జీవిత చరిత్ర

జయలలిత ఆరోగ్యం గురించి తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నై నగర పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇక జయలలిత జీవిత చరిత్ర, ఆమె రాజకీయ వివరాల గురించి పుస్తకాలు ముద్రించారు.

అమ్మ పెన్నులు, కీచైన్లు

అమ్మ పెన్నులు, కీచైన్లు

వ్యాపారులు ముద్రించిన జయలలిత చరిత్ర పుస్తకాలను ఆసుపత్రి దగ్గర జోరుగా విక్రయిస్తున్నారు. అదే విధంగా జయలలిత ఫోటోలతో పెన్ లు, కీచైన్లు, బోమ్మలు తయారు చేసిన వ్యాపారులు ఆసుపత్రి దగ్గర విక్రయిస్తున్నారు.

రోజుకు రూ. 2 వేలు సంపాదన

రోజుకు రూ. 2 వేలు సంపాదన

అమ్మ ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకోవడానికి వస్తున్న ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు జోరుగా వాటికి కోనుగోలు చేస్తున్నారు. ఆసుపత్రి దగ్గర ఇలా విక్రయిస్తున్న వ్యాపారులు రోజుకు తాము రూ. 2,000 సంపాధిస్తున్నామని చెబుతున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. గత నెల 22వ తేదిన జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+