Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆశారం బాపు రేప్ కేసులో సాక్షిని కాల్చి చంపారు

ముజఫర్‌నగర్: ఆశారాం బాపు అత్యాచారం కేసులో సాక్షిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా 35 ఏళ్ల అఖిల్ గుప్తాను న్యూ మండీ పోలీసు స్టేషన్ పరిధిలోని జన్‌సత్ రోడ్డులో కాల్చి చంపారు. ఆశారాం సూరత్ అత్యాచారం కేసులో అతను సాక్షి.

ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారని, వెంటనే ఆస్పత్రికి తరలించామని, అయితే, అప్పటికే అతను మరణించాడని వైద్యులు తేల్చారని పోలీసులు చెప్పారు. గుప్తా ఆశారాం బాపు వంట మనిషిగా, వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ వచ్చాడు.

Witness in Asaram Bapu's Surat rape case shot dead

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో ఆశారాం బాపు జైలులో ఉన్నాడు. తమపై ఆశారాం బాపు, అతని కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని సూరత్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ఆరోపించారు. గుప్తా ఈ కేసులో సాక్షి. అతని వాంగ్మూలాన్ని గాంధీ నగర్ కోర్టులో రికార్డు చేశారు.

లైంగిక దాడి కేసులో నిందితుడైన ఆశారాం సాయి తనయుడు నారాయణ సాయిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. గత 58 రోజులుగా అతను పరారీలో ఉన్న అతన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. సూరత్‌లో లైంగిక దాడి కేసులో నారాయణ సాయి నిందితుడు. అరెస్టు చేసిన సమయంలో అతను టర్బన్ ధరించి ఉన్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+