వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమ, పెళ్లి పేరుతో మాజీ ఎంపీ కొడుకు డ్రామా, ఎంజాయ్ చేసి ఎస్కేప్, రేపు వేరే అమ్మాయితో పెళ్లి !

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ ( ఆర్ జేడీ) పార్టీ మాజీ ఎంపీ విజయ్ యాదవ్ కుమారుడు విశ్వజిత్ యాదవ్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడని, పెళ్లి పేరుతో రూ. 13 లక్షలు లాక్కొని మోసం చేశాడని బాధితురాలు పాట్నాలోని గార్డ్నిబాగ్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు చెయ్యడంతో మాజీ ఎంపీ విజయ్ యాదవ్ కుమారుడు విశ్వజిత్ యాదవ్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. విశ్వజిత్ యాదవ్ ఈనెల 22వ తేదీ శుక్రవారం (రేపు) వేరే అమ్మాయితో వివాహం చేసుకోవడానికి సిద్దం అయిన సమయంలో కేసు నమోదు అయ్యింది.

డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ బెయిల్ రద్దు, అరెస్టు వారెంట్, ఆడియో!

 ఎంపీ కొడుకు లవ్ ట్రాక్

ఎంపీ కొడుకు లవ్ ట్రాక్

విశ్వజిత్ యాదవ్ తాను చాల కాలం నుంచి స్నేహితులు అని బాధితురాలు చెబుతోంది. స్నేహంగా ఉంటున్న విశ్వజిత్ యాదవ్ తనను ప్రేమించాడని, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించామని యువతి పోలీసులకు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన విశ్వజిత్ యాదవ్ తనను చాలా చోట్లకు విహారయాత్రకు తీసుకెళ్లాడని బాధితురాలు చెప్పింది.

ప్రేమ ముసుగులో ఎంజాయ్

ప్రేమ ముసుగులో ఎంజాయ్

పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించిన విశ్వజిత్ యాదవ్ తనతో బలవంతంగా లైంగిక కోరికలు తీర్చుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ఏకాంతంగా గడిపాడని బాధితురాలు అంటోంది.

పెళ్లి ఫిక్స్, ఫ్లాట్, డబ్బు !

పెళ్లి ఫిక్స్, ఫ్లాట్, డబ్బు !

తన ప్రేమ విషయం తెలుసుకున్న మా తల్లిదండ్రులు విశ్వజిత్ తో పెళ్లి జరిపించాలని నిర్ణయించారని, ఇద్దరూ కలిసి నివాసం ఉండటానికి ఓ ఖరీదైన ప్లాట్ కొనుగోలు చేసి ఇచ్చారని బాధితురాలు అంటోంది. పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి తన దగ్గర విశ్వజిత్ యాదవ్ రూ. 13 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది.

మరో అమ్మాయితో పెళ్లి

మరో అమ్మాయితో పెళ్లి

విశ్వజిత్ యాదవ్ తో తన పెళ్లి రద్దు అయ్యిందని, అప్పటి నుంచి తనను మానసికంగా హింసించడం మొదలు పెట్టాడని, ఇప్పుడు మరో అమ్మాయితో నవంబర్ 22 (శుక్రవారం) పెళ్లి చేసుకోవడానికి అతను సిద్దం అయ్యాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 రాష్ట్రపతికి లేఖ

రాష్ట్రపతికి లేఖ

తన తండ్రి మీద విశ్వజిత్ యాదవ్ దాడి చేశాడని, తరువాత తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, తన మీద ఒత్తిడి తీసుకు వచ్చి కేసు వెనక్కి తీసుకునేలా చేశారని బాధితురాలు ఆరోపించింది. ఇదే సంవత్సరం తనకు న్యాయం చెయ్యాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. విశ్వజిత్ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదని, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు మనవి చేస్తూ లేఖ రాశానని బాధితురాలు తెలిపింది.

 యువతిపై మాజీ ఎంపీ ఫ్యామిలీ దాడి

యువతిపై మాజీ ఎంపీ ఫ్యామిలీ దాడి

బాధితురాలు తమకు ఫిర్యాదు చేసిందని, విచారణకు పోలీస్ స్టేషన్ కు రావాలని విశ్వజిత్ యాదవ్ కు సమాచారం ఇచ్చామని, మా ఇంట్లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని, తాను పోలీస్ స్టేషన్ కు రావడం కుదరదని అతను చెప్పాడని మహిళా పోలీస్ స్టేషన్ అధికారి ఆర్తీ జైస్వాల్ మీడియాకు చెప్పారు. విశ్వజిత్ యాదవ్ ఇంటి దగ్గరకు వెళ్లి తన దగ్గర తీసుకున్న రూ. 13 లక్షలు తిరిగి ఇవ్వాలని చెప్పానని, ఆ సమయంలో మాజీ ఎంపీ విజయ్ యాదవ్ కుటుంబ సభ్యులు తన మీద దాడి చేశారని బాధితురాలు ఆరోపించిందని పోలీసు అధికారి ఆర్తి జైస్వాల్ మీడియాకు చెప్పారు. తనకు న్యాయం చెయ్యాలని బాధితురాలు పాట్నా పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తోంది. రేపు శుక్రవారం విశ్వజిత్ యాదవ్ పెళ్లి జరుగుతున్న సమయంలో ఈ కేసు బీహార్ లో, ఆర్ జేడీ పార్టీలో కలకలం రేపింది.

English summary
Bihar: A woman has accused former Rashtriya Janata Dal (RJD) MP, Vijay Yadav's son of sexual harassment and fraud of Rs 13 lakh on the pretext of marriage. The victim has lodged a complaint against Vishwajit Yadav in Gardnibagh women police station in Patna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X