ఇద్దరు కుమారుల గొంతు కోసి..తాను రైలు కింద తలపెట్టి!

భువనేశ్వర్: కుటుంబ కలహాలు ఓ మహిళను ఉన్మాదానికి ప్రేరేపించాయి. కుటుంబ కలహాలకు ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో ఆమె విచక్షణ కోల్పోయారు. తన ఇద్దరు కుమారులను గొంతు కోసి హత్య చేశారు. అనంతరం తానూ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మృతురాలి పేరు బిమలా మాంఝీ. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబంతో కలిసి జిల్లాలోని భవానీపట్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగజ్ హరన్ గ్రామంలో నివసిస్తున్నారు. భార్య, భర్త రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా బిమల తన భర్తతో రోజూ గొడవ పడుతుండేవారని సింగజ్ హరన్ గ్రామస్తులు చెబుతున్నారు.

భర్త రోజూ మద్యం సేవించి వచ్చేవాడని, బిమలను చితకబాదుతుండేవాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కలహాలకు ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం తెల్లవారు జామున నిద్రపోతున్న తన ఇద్దరు కుమారులు రవీంద్ర మాఝీ, దుష్యంత్ మాఝీల గొంతు కోసి, హత్య చేశారు.

Woman Allegedly Kills Two Sons, Commits Suicide

అనంతరం తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బిమలా మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు భవానీపట్నా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటికి వెళ్లి చూడగా.. రవీంద్ర మాఝీ, దుష్యంత్ మాఝీ రక్తపు మడుగులో కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+