భర్త కళ్లెదుటే.. భార్యను నగ్నంగా మార్చి, గ్రామంలో ఊరేగింపు

Subscribe to Oneindia Telugu

బీడ్: సోదరుడి అక్రమ సంబంధానికి సహకరించిందన్న కారణంతో మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వర్న్ గాల్‌వాది గ్రామంలో చోటు చేసుకుంది. ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు సహా ఓ టీనేజీ బాలిక కూడా ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.

అగస్టు 2న బాధితురాలి ఇంట్లోకి చొరబడ్డ వీరంతా.. ఆమెను బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. తొలుత ఆమె దుస్తులు చింపివేసి, ఆపై చెప్పులతో కొడుతూ గ్రామంలో ఊరేగించారు. నిందితుల కుటుంబానికి చెందిన ఒక మహిళతో బాధితురాలు సోదరుడికి అక్రమ సంబంధం ఉందని, అందుకు సహకరించిందన్న కారణంతోనే ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

 Woman Allegedly Paraded Naked In Maharashtra For Helping Brother Have An Affair

కాగా, భర్త ఎదుటే బాధితురాలిపై నిందితులు దాడి చేయడం గమనార్హం. క్షమించమని ప్రాధేయపడటంతో చివరకు వదిలేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై జిరాయ్ తాలుకాలోని ఛక్లాంబా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో టీనేజీ బాలిక సహా దాడికి పాల్పడ్డ 9మందిని అరెస్టు చేశారు. టీనేజీ బాలికను జువైనల్ హామ్ కు తరలించారు. నిందితులను మారుతి సత్లే, బాబన్ సత్లే, అంగద్ ఇంగోల్, కుంతా ఇంగోల్, లంకా సత్లే, రేఖ ఇంగోల్, జాంబర్ దంతల్‌గా గుర్తించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 28-year-old woman was assaulted and paraded naked in Varngalwadi village in Beed district of Maharashtra last Friday, the police said on Monday. Eight people have been arrested for the crime. A teenage girl has also been detained in connection with the case.
Please Wait while comments are loading...