ఏడాది పాటు చేశాడు: సహజీవనం చేసిన యువతి, గతంలో రూ.1.50కు సెటిల్

జైపూర్: రాజస్థాన్‌లో ఓ 22 ఏళ్ల యువతి తాను సహజీవనం చేసిన వ్యక్తి పైన అత్యాచారం కేసు పెట్టింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ బాధిత యువతి ఫిర్యాదు చేసిందని పోలీసులు బుధవారం తెలిపారు.

బాధిత మహిళ రాంగంజ్ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. సదరు యువతికి గతంలోనే పెళ్లైంది. ఆ తర్వాత కొద్ది రోజులుగా ఆమె తన భర్త నుండి వేరుగా ఉంటోంది. అనంతరం ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. తనను 25 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించింది.

Woman alleges rape by live-in partner in Rajasthan

తామిద్దరం కలిసి ఈద్గా ప్రాంతంలో గత ఏడాది కాలంగా కిరాయి ఇంటిలో ఉంటున్నామని, అప్పటి నుండి సహజీవనం చేస్తున్నామని ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు కోరికలు తీర్చుకొని, ఇప్పుడు మాట తప్పాడని పేర్కొంది.

నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకుంటామని, అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపిస్తామని చెప్పారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 376 తదితర సెక్షన్ల కిందే నిందితుడు ఆరీఫ్ పైన కేసు నమోదు చేశారు. అతనిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇలాంటి కేసునే ఈ మహిళ 2010వ సంవత్సరంలో మరో వ్యక్తి పైన పెట్టింది. అనంతరం లక్షా యాభై వేల రూపాయలకు సెటిల్ చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+