పిల్లల్ని కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి!
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కేంద్ర కారాగారానికి చెందిన అధికారులకు ఓ మహిళ అరుదైన అభ్యర్థన చేసింది. తనకు సంతానం కావాలని.. అందుకు జైల్లో ఉన్న తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని దరఖాస్తు చేసుకుంది.
గ్వాలియర్‌లోని శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్‌కు ఏడు సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే పోలీసులు అతడిని ఓ హత్యకేసులో అరెస్టు చేశారు. జాతవ్ దోషిగా తేలడంతో జీవితఖైదు విధించారు. అప్పటి నుంచి గ్వాలియర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. దారా భార్య, కుటుంబ సభ్యులు జైలు అధికారులకు ఓ దరఖాస్తు చేసుకున్నారు. తనకు పిల్లలు కావాలని, తన భర్తను పెరోల్ (Parole)పై విడుదల చేయాలని దారా భార్య కోరింది.

దీనిపై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. దరఖాస్తును శివ్‌పురి ఎస్పీకి పంపించినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం.. జీవితఖైదు పడిన దోషి రెండు సంవత్సరాల శిక్షాకాలం పూర్తి చేసుకుంటే అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్ ఇస్తారు. అయితే దీనిపై జిల్లా కలెక్టర్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటారన్నారు.
గతంలో ఓ రాజస్థాన్ మహిళ ఇలాంటి అభ్యర్థనతోనే కోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో అక్కడి హైకోర్టు అరుదైన తీర్పునిచ్చింది. సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నాని, అందుకు జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాలని ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జోధ్‌పుర్ ధర్మాసనం.. ఆ మహిళ భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది












Click it and Unblock the Notifications