ఇలా అయితే ఒంటరి మహిళ ట్రైన్ జర్నీ చేయడం కష్టం: సెకెండ్ ఏసీ కోచ్ లో నరకం

సాధారణంగా స్లీపర్ బోగీల్లో ఎక్కే అవకాశం టికెట్ రహిత ప్రయాణికులకు ఉండుదు. టీటీఈ చేతికి చిక్కితే భారీగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఏకంగా 2ఏసీ కంపార్ట్ మెంట్లోనే ఎక్కేశారు టికెట్ లెస్ ట్రావెలర్లు. ఆ బోగీ మొత్తం కూడా క్రిక్కిరిసిపోయింది. జనరల్ బోగీని తలపించింది. 2ఏసీ ప్రయాణికులకు రెస్ట్ తీసుకునే అవకాశం దొరకలేదు. పడుకున్న వారిని లేపి మరీ.. సీట్లల్లో కూర్చున్నారు.

పాట్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తతంగం మొత్తాన్ని కూడా ఆయుషి రంజన్ అనే ఓ 2ఏసీ మహిళా ప్రయాణికురాలు తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. దీన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రయాణ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించారు.ఈ వీడియో వైరల్ అయింది. ఈ బోగీలో ఓ మినీ సైజ్ తొక్కిసలాట జరిగే స్థాయిలో టికెట్ లెస్ ట్రావెలర్స్ ఎక్కారని, తనకు ప్రైవసీ లేకుండా పోయిందని వాపోయారు.

Woman Captures Ticketless Crowds in AC-2 Train Car

ఆయుషి రంజన్ తన తాతయ్య, నానమ్మల ఇంటికి వెళ్లేందుకు ఏసీ-2 కోచ్‌ ఎక్కారు. ఓ నాలుగు స్టేషన్లు దాటాక టికెట్ రహిత ప్రయాణికులు ప్రయాణికులు ఆ కోచ్ లో ఎక్కసాగారు. పట్నా నుంచి రైలు బయలుదేరిన వెంటనే.. రిజర్వ్ అయిన ఏసీ-2, ఏసీ-3 కోచ్‌లుప్రయాణికులతో నిండిపోయాయని రంజన్ వివరించారు. వారందరూ టికెట్ కొనలేదని తేల్చి చెప్పారు. రైలు పాట్నా స్టేషన్ కు రాగానే, టిక్కెట్లు లేనివారు ఏసీ-2, ఏసీ-3 కోచ్‌లలోకి ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కారని అన్నారు.

ఏస-2 కోచ్ లో కూడా ఒంటరి మహిళకు ఇబ్బందులు తప్పట్లేదని, ఇందులో ప్రయాణించడం ఎంత కష్టమో తనకు తెలియవచ్చిందని వివరించారు. ఒక ఒంటరి మహిళ, ఈ రైలు ఎక్కడం ఎంత కష్టమో, అందులో ప్రయాణించడం కూడా అంతే కష్టంగా ఉంది. టికెట్ లెస్ ట్రావెలర్లు ఎవరూ రారనే కారణంతోనే 2ఏసీ టికెట్ ను బుక్ చేసుకున్నానని, ఇప్పుడు చూస్తే అంతా తలకిందులుగా ఉందని అన్నారు. డబ్బులు వేస్ట్ అయ్యాయని కామెంట్ చేశారు.

"నేను సాధారణంగా ఎవర్నీ తిట్టను, ఎవరి మీద కోప్పడను. ఇక్కడ మాత్రం చిరాకుగా అనిపించింది. ఎవరి మీద కోప్పడాలో తెలియట్లేదు. బెర్త్ వద్దకు వెళ్ళడానికి నేను ఎన్నిసార్లు గొంతు పెంచాల్సి వచ్చిందో నాకు తెలియదు" అని ఆయూషీ రంజన్ చెప్పారు. పడుకున్న తనను లేపి ఓ మహిళ తన బెర్త్ పై బైఠాయించిందని చెప్పారు. ఈ బోగీలో భరించలేనంత దుర్వాసన వస్తోందని, కోచ్ కూడా క్లీన్ గా లేదని అన్నారు. ఆమె వీడియో ఇప్పుడు దాదాపు పది లక్షల వీక్షణలతో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+