Delhi Elections 2020: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం: మహిళా ఎస్ఐ కాల్చివేత..బుల్లెట్ల వర్షం..!
న్యూఢిల్లీ: తెల్లవారితే హస్తిన అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఆరంభమౌతుంది. దేశ రాజధానిలో ఎన్నికల హడావుడి ప్రారంభమౌతుంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన వేళ.. ఒక్కసారిగా కలకలం చెలరేగింది. విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భద్రతా బలగాలను భారీగా మోహరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హతురాలి పేరు ప్రీతి అహ్లావత్. పత్‌పర్ గంజ్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఆమె పని చేస్తున్నారు. రాత్రి 9:30 గంటల సమయంలో రోహిణి ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రీతి అహ్లావత్‌పై కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆమె తలకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఫలితంగా ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలను చేపట్టారు. రోహిణి ఈస్ట్ మెట్రో స్టేషన్ వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వాటి ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. బైక్‌పై కాల్పులకు తెగబడి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించినట్లు రోహిణీ అదనపు పోలీస్ కమిషనర్ ఎస్‌డీ మిశ్రా తెలిపారు.












Click it and Unblock the Notifications