పర్సు కోసం రైల్లోంచి దూకేసిన తల్లీకూతుళ్లు
భోపాల్: దొంగను ఎలాగైనా పట్టుకోవాలనే ఆవేశంతో తల్లీకూతుళ్లు కదులుతున్న రైలులో నుంచి కిందకు దూకేసి తీవ్రగాయాలైన సంఘటన భోపాల్-బైరాంఘర్ రైల్వే స్టేషన్ల పరిధిలో జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రైల్వే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం చత్తీస్ గడ్ కు చెందిన ఆశ్వా తివారి (51), ఆమె కుమార్తె అంజన(21) బిలాస్ పూర్ నుంచి ఇండోర్ వెళ్లేందుకు నర్మద ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కారు. అదే రైలులో ఉన్న ఓ దొంగ ఆశ్వా తివారి దగ్గర ఉన్న వ్యానిటీ బ్యాగ్ లాక్కోవడానికి స్కెచ్ వేశాడు.

అదును చూసి ఆశ్వా తివారి దగ్గర ఉన్న వ్యానిటీ బ్యాగ్ లాక్కొన్నాడు. ఆ సమయంలో తల్లీ కుమార్తె దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కదులుతున్న రైలులో నుంచి దొంగ కిందకు దూకేశాడు. ఆవేశంలో అతనిని పట్టుకోవాలని తల్లీ కుమార్తె కిందకు దూకేశారు.
దొంగ తప్పించుకున్నాడు. తల్లీ కుమార్తెకు తీవ్రగాయాలైనాయి. వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు తల్లీ కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications