టాయిలెట్ లేదని భర్తకు విడాకులు, మరో ఆరుగురు..

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళ మెట్టినింట టాయిలెట్ నిర్మించడానికి భర్త పూనుకోకపోవడంతో అతనికి విడాకులిచ్చిన సంఘటన చోటు చేసుకుంది. రాయ్‌గఢ్ జిల్లాలో ఇది జరిగింది. వివాహానికి ముందే టాయిలెట్ నిర్మించాలని అమ్మాయి తరపు వారు షరతు విధించినా, భర్త తరపు వారు ఆ షరతు పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు.

దీంతో, భార్యాభర్తల మధ్య పలుసార్లు గొడవలు కూడా జరిగాయి. అత్తింటి వారి తీరుకు నిరసనగా ఆమె పుట్టింటికి చేరడం, మళ్ళీ రావడం ఇలా పదేపదే జరిగింది. గ్రామంలో అందరి ముందు నడుచుకుంటూ బహిర్భూమికి వెళ్ళాల్సి రావడం సిగ్గుచేటని భావించిన ఆమె, విడాకులు తీసుకుంది.

Woman divorces husband after he fails to build a toilet at home

మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు ఆరు వరకు జరిగాయి. కుషినగర్ జిల్లాలోని తమ అత్తవారిళ్ళలో టాయిలెట్లు లేకపోవడంతో ఆరుగురు నవవధువులు పుట్టింటికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+