ఘోరం: మహిళా ఇంజినీర్ సజీవదహనం, రేప్ చేశారా?
ముజఫర్‌నగర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆదివారం జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళా ఇంజనీర్‌ను సజీవ దహనం చేశారు.
ఆమె పాదరక్షలు, దుస్తుల ద్వారా ఆమె బజరంగ్ బీహార్ కాలనీకి చెందిన సరిత కుమారిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఎమ్‌జిఎన్‌రెగాలోని మురల్ బ్లాక్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

ఆమె ఉంటున్న గదిలోనే ఆమెను సజీవ దహనం చేశారు. ఆమె ధరించిన దుస్తులు పక్కన పడి ఉండటంతో అత్యాచారం చేసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, సదరు మహిళా ఇంజినీర్ చాలా మంచి అమ్మాయని, తన పని తాను చేసుకుపోయేదని ఆమెను గుర్తించిన స్థానికులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications