మత్తు మందు ఇచ్చింది: నగలు, తుపాకితో ఎస్కేప్
లక్నో: కుటుంబ సభ్యులను నమ్మించి మాయమాటలు చెప్పి వారికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చిన యువతి ఇల్లు లూటీ చేసి మాయం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇల్లు లూటీ కావడం, యువతి అదృశ్యం కావడంతో పోలీసులు గాలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో సరిత అనే యువతి నివాసం ఉంటున్నది. సోమవారం రాత్రి సరిత మత్తు మందు కలిపి ఉన్న ఆహారపదార్థాలను కుటుంబ సభ్యులకు ఇచ్చింది. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు మత్తులోకి జారుకున్నారు.

తరువాత సరిత ఇంటిలో గాలించి రూ. 20 లక్షల విలువైన బంగారు నగలు, నగదు, లైసెన్స్ ఉన్న తుపాకి చేతపట్టుకుని ఇంటి నుంచి పరారైయ్యింది. మంగళవారం ఉదయం మత్తులో నుంచి కుటుంబ సభ్యులు బయటపడ్డారు.
సరిత కనపడకపోవడంతో గాలించారు. అదే సమయంలో ఇంటిలో నగదు, నగలు, తుపాకి మాయం అయ్యిందని గుర్తించి కోత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసు అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications