వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: భర్త చికిత్స కోసం వస్తే.. భార్యపై గ్యాంగ్‌రేప్‌.. అదీ ఆసుపత్రిలో..

భర్తకు వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో ఈ దారుణం చోటుచేసుకుంది.

|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. భర్తకు వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో ఈ దారుణం చోటుచేసుకుంది.

హర్దోయి నగరానికి చెందిన ఓ మహిళ(42) అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను తీసుకుని రెండు రోజుల క్రితం లక్నోలోని కింగ్‌ జార్జి మెడికల్‌ యూనివర్సిటీకి వెళ్లింది. బుధవారం రాత్రి భర్తకు ఆహారం తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె సామూహిక అత్యాచారానికి గురైంది.

Woman gangraped in Lucknow's KGMU hospital

ఆమెను లిఫ్ట్‌ ఆపరేటర్‌ వినయ్‌, సెక్యూరిటీ గార్డు శివ్‌కుమార్‌తో పాటు సంతోష్‌ అనే వ్యక్తి బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన సంతోష్‌, శివ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న వినయ్‌ కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.

English summary
A 42-year-old woman was allegedly raped by three persons including a liftman and a security guard at the King George's Medical University (KGMU) here, where she had gone for the treatment of her husband, the police said. The incident took place yesterday night when the woman, a resident of Hardoi, left her husband to get food and was allegedly raped by a liftman named Vinay, security guard Shiv Kumar and a third person named Santosh. Police officials said that a case was promptly registered on the victim's complaint and two of the accused - Kumar and Santosh - have been arrested. The third accused, Vinay, is absconding, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X