దారుణం: కదిలే కారులో వివాహితపై గ్యాంగ్‌రేప్
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నలుగురు బిడ్డల తల్లి అయిన ఓ మహిళ(40)పై ఇద్దరు యువకులు కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
శనివారం మధ్యాహ్నం మీరట్‌కు వచ్చి ఆ మహిళ.. ఏవో మందులు కొనుక్కుని తిరిగి వెళుతున్న సమయంలో ఇంటిదగ్గర దింపేస్తామంటూ నిందిత యువకులు చెప్పారు. కారులో ఎక్కిన ఆమెకు మత్తుమందు కలిపిన శీతలపానీయాన్నిచ్చారు.

అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెపై ఒకరు కారు నడుపుతుండగా.. మరొకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళను సమీపంలోని ఓ కాలువ వద్ద పడేసి వెళ్లిపోయారు.
గస్తీ తిరుగుతున్న పోలీసులు అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications