కూతురిని రేప్ చెయ్యడానికి వెళ్లిన రౌడీ: చంపేసిన భార్య
ఇండోర్: మద్యం మత్తులో వెళ్లిన భర్త కుమార్తె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో తట్టుకోలేని మహిళ అతనిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన మద్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని మారుతి మలాసియా కాలనీలో నివాసం ఉంటున్న రవి అలియాస్ చాంపియా (45) అనే రౌడిని అతని భార్య అంతం చేసింది.
ఫమీదాబీ (39) అనే మహిళ పెళ్లి అయిన కొన్నినెలలకే భర్తను వదిలి పెట్టింది. తరువాత రవిని రెండవ వివాహం చేసుకుంది. వీరికి 20 సంవత్సరాల కుమార్తె ఉంది. కొన్ని సంవత్సరాల నుండి రవి, ఫమీదాబీ కుమార్తెతో మారుతి మలాసియా కాలనీలో నివాసం ఉంటున్నారు.
రవి పెద్ద క్రిమినల్. అతని మీద ఇండోర్ లోని వివిధ పోలీస్ స్టేషన్ లలో 18 కేసులు నమోదు అయ్యాయి. కొన్ని పోలీస్ స్టేషన్ లలోని రౌడిషీటర్ జాబితాలో అతని పేరు ఉంది. బుధవారం రాత్రి పోద్దు పోయిన తరువాత పీకలదాక మద్యం సేవించిన రవి ఇంటికి వెళ్లాడు.

మద్యం మత్తులో ఉన్న రవి కుమార్తె మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో యువతి కేకలు వేసింది. ఫమీదాబీ కుమార్తెను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. రవి భార్య మీద దాడి చేశాడు. కుమార్తెను లాక్కోని బెడ్ రూంలోకి వెళ్లాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఫమీదాబీ నేరుగా వంట గదిలోకి వెళ్లింది.
కారం పోడి, కత్తి తీసుకుని వచ్చింది. భర్త కళ్లలో కారం చల్లింది. అతను కళ్లు తుడుచుకుంటున్న సమయంలో కత్తితో భర్తను కసితీర పొడిచింది. రక్తం ఎక్కువ పోవడంతో అతను ఇంటిలోనే మరణించాడు. రాత్రి మొత్తం తల్లి, కుమార్తె శవం పక్కనే ఉన్నారు. మరుసటి రోజు ఫమీదాబీ చందన్ నగర్ పోలీస్ స్టేషన్ చేరుకుని లోంగిపోయింది.












Click it and Unblock the Notifications