వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్త హత్య

పోలీసుల కథనం ప్రకారం.. హంసా రేఖ(28), సత్యనారాయణ్ ఇద్దరు దంపతులు. కాగా, సత్యనారాయణ్ రోజూ మద్యం తాగివచ్చేవాడు. దీంతో అసహనానికి గురైన రేఖ తన మరదలు అంజలి ఇంటికి వెళ్లి కొన్ని రోజులపాటు అక్కడేవుంది. అక్కడే ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న అరుముగమ్ రేఖకు పరిచయమయ్యాడు. ఆ పరిచయం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది.
వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ సత్యనారాయణ్.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. సోమవారం మద్యం తాగి వచ్చిన సత్యనారాయణ్.. రేఖను చితకబాదాడు. దీంతో ఆమె అరుముగమ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి సత్యనారాయణ్‌ను గొంతునులిమి హత్య చేశారు.
ఆ తర్వాత తన సత్యనారాయణ్ గుండెపోటుతో మరణించాడని నమ్మించే ప్రయత్నం చేసింది రేఖ. కాగా, సత్యనారాయణ్ మెడపై గాయాలు ఉండటంతో వాటిని గుర్తించిన అతని సోదరి అంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు, నిందితులు రేఖ, అరుముగమ్‌లను అరెస్ట్ చేశారు. తన భర్తను హత్య చేసినట్లు రేఖ పోలీసులు ముందు అంగీకరించింది.












Click it and Unblock the Notifications