హవ్వా.. మైనర్‌తో యువతి పెళ్లి.. ఆమెతోపాటు పెళ్లికి హాజరైనవారిపై కేసు..
ప్రేమకు భావం ఒక్కటే చాలు.. భాష, వయస్సు కూడా అక్కర్లేదు. అయితే ఇద్దరూ మేజర్లు అయితే ఓకే.. కానీ మైనర్లు కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతు ఉన్నారు. లేచిపోవడమే కాదు.. పెళ్లి కూడా చేసుకుంటున్నారు. కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఓ 17 ఏళ్ల మైనర్ యువకుడు.. అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. తర్వాత పెళ్లి కూడా చేసుకోవడంతో చర్చానీయాంశమైంది.

మైనర్‌తో పెళ్లి..
బీఎస్సీ నర్సింగ్ చదువుతోన్న 20 ఏళ్ల యువతి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఫేస్‌బుక్‌లో 17 ఏళ్ల అబ్బాయితో ఫ్రెండ్ షిప్ చేసింది. అదీ కాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇద్దరు కలుసుకోవడం ప్రారంభించారు. ఒకరిని విడిచి మరొకరు ఉండే పరిస్థితి లేదు. దీంతో ఇంట్లో వాళ్లను ఎదురించి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే మైనర్ బాలుడిని యువతి పెళ్లి చేసుకుందన్న వార్త ఆ ఊళ్లో అందరికీ తెలియడంతో విషయం కాస్తా పోలీసుల వరకు చేరింది.

సీన్ రివర్స్
పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. మైనర్ బాలుడిని పెళ్లి చేసుకున్న యువతిపైనే కాదు, ఆ పెళ్లికి హాజరయిన వాళ్లపై కూడా కేసు నమోదు చేశారు. చిక్‌మంగళూరు జిల్లాలో ఓ గ్రామానికి చెందిన బాలుడికి బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల యువతికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. యువతి బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. రోజూ ఆ బాలుడితో చాట్ చేసేది. వీడియో కాల్స్ మాట్లాడేది. ఈ క్రమంలో 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగింది. ఆ బాలుడు కూడా సరేనని అంగీకరించాడు.

ఎదిరించారు.. కానీ
ఇంట్లో వాళ్లకు చెప్పా పెట్టకుండా ఆ యువతి ఆ బాలుడి ఊరికి వచ్చింది. ఆ బాలుడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ఆమె అతడిని వెంటబెట్టుకుని ఓ ఆలయానికి వెళ్లింది. అతనికి సంబంధించిన కొందరు స్నేహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి జరిగింది. అ విషయం ఆ గ్రామంలో తెలిసింది. మైనర్ బాలుడిని ఓ యువతి పెళ్లాడిందనే సంగతి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ గ్రామానికి వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నామని.. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి జరిపించిన వారితోపాటు ఆ యువతిపై కూడా కేసును నమోదు చేశాం అని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications