సీఏఏ వ్యతిరేక సభ: పాక్ జిందాబాద్ అంటూ యువతి కలకలం, అసదుద్దీన్ ఓవైసీ ఖండన

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఓ యువతి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి కలకలం సృష్టించింది. ఈ సభలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొని ప్రసంగించారు.

సీఏఏకు వ్యతిరేకంగా 'సేవ్ కానిస్టిట్యూషన్'పేరుతో నిర్వహించిన సభలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించిన అనంతరం అమూల్య అనే యువతి వేదికపైకి వచ్చింది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. పాకిస్థాన్ జిందాబాద్.. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ ఏదో చెప్పబోయింది.. ఇంతలోనే అక్కడున్నవారంతా ఆమెను అడ్డుకున్నారు.

Woman raises pro-Pak slogans at anti-CAA stir in Bengaluru in the presence of AIMIM chief Owaisi

ఆ యువతి వద్ద నుంచి వెంటనే మైక్ లాక్కున్నారు అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు ఆమెను అక్కడ్నుంచి పంపించేశారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. ఆ యువతి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆమె ఎవరో తెలియదని, ఈ సభకు ఆమెను ఆహ్వానించలేదని చెప్పారు. తాము భారత్ లోనే ఉంటాం.. భారత్ కోసం ఉంటామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌కు ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+