కలికాలం : భర్త బీర్ తాగనివ్వలేదని..
అహ్మదాబాద్ : భార్యాభర్తల బంధానికి విలువే లేకుండా పోయింది. టిక్ టాక్ చేయనివ్వలేదని ఒకరు, టీవీ రిమోట్ ఇవ్వలేదని మరొకరు చిన్న చిన్న కారణాలతో విడాకులకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి బయటకు వచ్చింది. బీర్ తాగనివ్వలేదన్న సిల్లీ రీజన్‌తో ఓ భార్య డైవర్స్‌కు పట్టుబట్టింది. హనీమూన్‌లోనే రచ్చ రచ్చ చేసి పరువు తీసింది. గతేడాది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
Recommended Video


బీర్ తాగొద్దన్న భర్త
అహ్మదాబాద్ నిర్ణయ్ నగర్‌లోని తరంగహిల్ సొసైటీకి చెందిన విజయ్‌కు మధుపురాకు చెందిన హీరల్‌తో 2018లో పెళ్లైంది. బాజా భజంత్రీలు, బంధువుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా వివాహతంతు జరిపారు. అనంతరం కొత్త దంపతులు హనీమూన్ కోసం ఇండోనేషియాలోని బాలీ ద్వీపానికి వెళ్లారు. పగలంతా బయట ఎంజాయ్ చేసిన భార్యభర్తలు రాత్రికి రూంకు చేరుకున్నారు. ఇంతలో హీరల్, విజయ్‌ను బీర్ తాగుదామని కోరింది. అయితే మద్యం తాగడం ఇష్టంలేని అతను అందుకు నిరాకరించాడు. ఆమెను కూడా మద్యం తాగవద్దని అన్నాడు.

హోటల్‌లో రచ్చ రచ్చ
భర్త నోటి నుంచి వద్దు అనే మాట వినేసరికి హీరల్ కోపంతో ఊగిపోయింది. తాము చెకిన్ అయిన హోటల్ రచ్చ రచ్చ చేసింది. హోటల్‌లోని ఇతర రూంల తలుపులు బాదుతూ హంగామా సృష్టించింది. ఈ అలికిడికి రూంల నుంచి బయటకు వచ్చిన వారికి తన భర్త బీర్ తాగనివ్వడంలేదని, అలాంటి వ్యక్తితో జీవితం ఎలా గడపాలని ప్రశ్నించింది. అలాంటి భర్తతో తాను కాపురం చేయలేనని తనకు వెంటనే విడాకులు కావాలని డిమాండ్ చేసింది.

విడాకుల కోసం రూ.20 లక్షల డిమాండ్
హనీమూన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత హీరల్ అత్తగారింట్లో రచ్చ చేసింది. మూటముల్లె సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త నుంచి విడాకులు కోరుతూ నోటీసులు పంపిన హీరల్.. భరణం కింద 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వనిపక్షంలో తప్పుడు కేసులు పెడతామని కుటుంబాన్ని రోడ్డుపైకి తెస్తామని బెదిరింపులకు దిగింది. దీంతో బాధిత భర్త పోలీసులను ఆశ్రయించడంతో ఇన్నాళ్లకు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications