మూడో సారి ఆడబిడ్డ పుట్టింది: భార్య నెత్తిన రాయి వేసిందని కాల్చి చంపేసిన భర్త!
లక్నో: ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మూడో సారి ఆడబిడ్డ పుట్టడంతో భార్య నెత్తిన రాయి వేసిందని సహనం కోల్పోయిన భర్త అతిదారుణంగా కాల్చి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బాలింత అని కనికరం లేకుండా భార్యను హత్య చేసిన నిందితుడు కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు.
ఉత్తరప్రదేశ్ లోని బులందర్ శహర్ సమీపంలోని కోత్వాలిలో ఆరీఫ్ నివాసం ఉంటున్నాడు. ఇతని భార్యకు ఇంతకు ముందే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. రెండు రోజుల క్రితం ఆరీఫ్ భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయంపై ఆరీఫ్, అతని కుటుంబ సభ్యులు అతని భార్యతో గడవ పెట్టుకున్నారు.

గొడవ తారాస్థాయికి చేరడంతో బాలింత అయిన భార్య మీద చెయ్యి చేసుకున్నాడు. సహనం కోల్పోయిన ఆరీఫ్ రివాల్వర్ తీసుకుని భార్య కంటిలో కాల్చడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. భార్యను హత్య చేసిన ఆరీఫ్ కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న కోత్వోలి పోలీసులు కేసు నమోదు చేసి ఆరీఫ్ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications