అక్రమ సంబంధం వద్దన్నాడని.. ఇద్దరు పిల్లల తల్లి షాకింగ్ చర్య!
ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిన మేనల్లుడిపై ఆగ్రహంతో ఓ వివాహిత ఏకంగా పోలీస్ స్టేషన్ లోపలే తన చేతి మణికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.
ఎక్కడ మొదలైంది ఈ ప్రేమాయణం?
పూజ మిశ్రా అనే ఈ మహిళ ఢిల్లీకి చెందినది. ఆమె లలిత్ కుమార్ మిశ్రాను వివాహం చేసుకుంది. వీరికి ఏడు, ఆరేళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్తకు మేనల్లుడైన అలోక్ మిశ్రా(పూజ కంటే 15 సంవత్సరాలు చిన్నవాడు) ఒకసారి పని సాయం కోసం వారి ఇంటికి వచ్చాడు. అలోక్ కుటుంబంతో కలిసి ఉన్న సమయంలోనే పూజ, అలోక్‌ల మధ్య ప్రేమ చిగురించి అది అక్రమ సంబంధానికి దారితీసింది.

పిల్లలను వదిలేసి ప్రియుడితో 7 నెలలు
ఈ విషయం లలిత్ కుమార్ మిశ్రాకు తెలియడంతో అతను అలోక్‌ను ఇంట్లో నుంచి పంపించివేశాడు. అయితే అలోక్ వెళ్లిపోయినా పూజ ప్రశాంతంగా ఉండలేకపోయింది. ఆమె తన ఇద్దరు చిన్నపిల్లలను భర్తను వదిలిపెట్టి బరేలీకి వెళ్లింది. అక్కడ ఆమె, అలోక్ సుమారు 7 నెలల పాటు సహజీవనం చేశారు.
పోలీస్ స్టేషన్లో హైడ్రామా
కొంతకాల తర్వాత పూజ, అలోక్‌ల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దీంతో అలోక్ ఆమెను వదిలిపెట్టి తన స్వగ్రామమైన సీతాపూర్‌కు తిరిగి వచ్చాడు. అలోక్‌ను వెతుక్కుంటూ పూజ కూడా సీతాపూర్ చేరుకుంది. వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు స్థానిక పోలీసులు వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన చర్చల సమయంలో అలోక్ తమ సంబంధాన్ని ఇకపై కొనసాగించలేనని, ఆమెను వదిలివేయాలని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇది విన్న పూజ తీవ్ర ఆగ్రహానికి, మనస్తాపానికి గురైంది. ఒక్కసారిగా ఆమె తన వద్ద ఉన్న బ్లేడును తీసి అక్కడికక్కడే తన చేతి మణికట్టును కోసుకుంది. ఈ ఊహించని పరిణామంతో పీఎస్‌లో ఉన్న పోలీసు సిబ్బందితో పాటు అక్కడికి వచ్చిన ఇతరులు భయాందోళన చెందారు.
చికిత్స కోసం లక్నోకు తరలింపు
పోలీసులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన పూజను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను లక్నోకు రిఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications