అమ్మ సమాధి వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం: శశికళకు వ్యతిరేకంగా..
మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్ద సుమతి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడాన్ని కొంతమంది స్థానికులు గుర్తించారు.
చెన్నై: అన్నాడీఎంకె అధినేత్రిగా శశికళ పగ్గాలు చేపట్టిన తరుణంలో.. శశికళ పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఓ మహిళ జయలలిత సమాధి వద్ద ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
ఆత్మహత్య పాల్పడిన మహిళను సుమతిగా గుర్తించారు. అన్నాడీఎంకెలో శశికళ ఆధిపత్యాన్ని సహించలేకనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి వద్ద సుమతి విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడాన్ని కొంతమంది స్థానికులు గుర్తించారు.

అనంతరం హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. జయలలిత మరణంపై నెలకొని ఉన్న అనుమానాలు.. శశికళ నాయకత్వానికి ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. సుమతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. కాగా, అమ్మ మృతిపై అనుమానాలు వెలిబుచ్చుతూ.. మరోసారి రీ-పోస్ట్ మార్టమ్ చేస్తే అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉందంటూ మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications