బస్సులోంచి కిందపడి... అద్భుతంగా బతికిపోయింది!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో ఓ మహిళ ఆశ్చర్యకరంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె బస్సు లోపలి నుంచి కింద పడింది. కానీ, ఆమెకు ప్రాణాపాయం తప్పింది.
ప్రభుత్వ బస్సులో ఓ మహిళ ప్రయాణిస్తోంది. ఈ సంఘటన మంగళవారం నాడు కొల్లాం జిల్లాలో పునలూరు వద్ద జరిగింది. ఈ నగరం కేరళ - తమిళనాడు బార్డర్‌కు దగ్గరలో ఉంటుంది. మహిళ బస్సు ప్రమాదం నుంచి బయటపడిన సంఘటన అక్కడి సిసి కెమెరాల్లో రికార్డయి ఉంది.

ఈ సీసీ కెమెరా దగ్గరలోని బస్టాపులో ఉంది. ఆ బస్సు తమిళనాడు ట్రాన్సుపోర్ట్‌కు చెందింది. మహిళ బస్సులో నిలబడి ఉంది. అయితే, హఠాత్తుగా ఆమె అక్కడి నుంచి కిందకు జారిపడింది. అక్కడ రంద్రం ఉంది.
దీంతో, ఆమె బస్సులో నుంచి పడింది. ఆమె బస్సు వెనుక టైర్ల తర్వాత పడింది. దీంతో, ప్రాణాపాయం తప్పింది. బస్సు వెనుక టైర్లకు ముందు పడి ఉంటే, అవి ఆమె పై నుంచి వెళ్లే అవకాశముండేది.












Click it and Unblock the Notifications