ప్రతి నెలా రూ. 3,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు
పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల అయింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి కిందటే కోల్‌కతాలో దీన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వారికీ తాయిలాలు ప్రకటించారు. చొరబాటుదారులపై కఠిన చర్యలు, మెరుగైన శాంతిభద్రతల కల్పన, మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం, 7వ వేతన సంఘం అమలు వంటివి ఇందులో ఉన్నాయి.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని అమలు చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో పొందుపరిచామని, ఓ సమగ్ర రోడ్‌మ్యాప్‌లా వీటిని బెంగాల్ ప్రజల ముందు ఉంచామని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, హృదయపూర్వకంగా మార్పు కోరుకుంటున్నారని, ఇది తమతోనే సాధ్యమని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుపై బీజేపీ విజన్‌ను ఈ మేనిఫెస్టో ప్రతిబింబిస్తుందని వివరించారు.

బీజేపీ తన సంకల్ప పత్రం ద్వారా పలు కీలక వాగ్దానాలు చేసింది. రాష్ట్రంలో చొరబాటుదారులపై జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరించి, కఠిన చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టో పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏడవ వేతన సంఘం సిఫార్సులను 45 రోజుల్లో అమలు చేస్తారు. పశ్చిమ బెంగాల్‌లో ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తారు. మహిళా సాధికారత కోసం ప్రతినెలా రూ. 3,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
పోలీస్ శాఖతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. నిరుద్యోగ యువతకు కూడా నెలకు రూ. 3,000 ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వాలనేది బీజేపీ లక్ష్యం. ఈ ప్రణాళికలో అందరికీ న్యాయం, సరిహద్దుల భద్రతకు హామీ ఇవ్వడంతో పాటు, బెంగాల్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే 'వందేమాతరం మ్యూజియం' నిర్మాణ హామీ కూడా ఉంది. ఇది రాష్ట్ర ప్రజల సమగ్ర వికాసం, భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం అమిత్ షా తృణమూల్ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుడు హామీలు, చొరబాటుదారులతో సంబంధాల వల్ల మూడు దఫాలు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కమ్యూనిస్టులను వదిలించుకోవడానికి బెంగాల్ ప్రజలు మమత బెనర్జీని ఎన్నుకున్నారని, టీఎంసీ పాలనలో సిండికేట్లు, గూండారాజ్, చొరబాటుదారులతో ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒకప్పుడు మమతకు మద్దతు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఆమెకు మరోసారి అవకాశం ఇవ్వడానికి భయపడుతున్నారని ఆరోపించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!! -
మమతా పై బీజేపీ బ్రహ్మాస్త్రం - 2021 రిపీట్ అయ్యేనా, దీదీ రివేంజ్ తీర్చుకుంటారా..!! -
రాష్ట్రానికి 7వ వేతన సంఘం వర్తింపు -
దీదీ ఆస్తుల చూస్తే షాక్ అవ్వాల్సిందే! సంచలన అఫిడవిట్ -
ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..! -
Tamil Nadu Verdict: తమిళనాట సీన్ రివర్స్-డీఎంకేకు షాకిచ్చిన తాజా సర్వే..! -
స్టాలిన్, మమతకు ఈసీ భారీ షాకులు- సర్వే జోస్యాల వేళ సంచలన నిర్ణయాలు..! -
కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో భారీగా పోలింగ్-ఓట్ల శాతాలివే..1 -
మూడు రాష్ట్రాల్లో పోలింగ్: అందరి కళ్లు కేరళం వైపే..!! -
కదలి వచ్చిన మలయాళ సూపర్ స్టార్స్ -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే..












Click it and Unblock the Notifications