మోదీ జీ.. హమ్ తుమ్హారే సాథ్ హై
Waqf amendment Bill: దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు ఇంకాస్సేపట్లో లోక్‌సభ సమక్షానికి రాబోతోంది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టబోతోన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్- వాటి మిత్రపక్షాలు విప్ సైతం జారీ చేశాయి. తెలుగుదేశం పార్టీ సైతం విప్ ఇచ్చింది. ఈ బిల్లుకు జనసేన మద్దతు తెలిపింది.
వక్ఫ్ బిల్లు గతంలో పార్లమెంట్ ముందుకు వచ్చినప్పటికీ- అది ఆమోదం పొందలేదు. అందులో సవరణలను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జగదంబికా పాల్ దీనికి సారథ్యాన్ని వహించారు.

ఈ 31 మందిలో తెలంగాణ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, డీకే అరుణ, ఏపీ నుంచి లావు శ్రీ కృష్ణ దేవరాయలు, విజయసాయి రెడ్డి సభ్యులుగా కొనసాగారు. ఆ తరువాత సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ కమిటీ ఇప్పటివరకు 284 మందితో చర్చలు జరిపింది.
ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, కోల్కతా, లక్నో వంటి నగరాల్లో సమావేశమైంది. ప్రజాభిప్రాయాలను సేకరించింది. ముస్లిం మత పెద్దలతో భేటీ అయింది. అలాగే- మూడుసార్లు స్టడీ టూర్లనూ నిర్వహించింది. ఆయా రాష్ట్రాల వక్స్ బోర్డులు, ప్రభుత్వాలు, మైనారిటీ కమిషన్ ఛైర్మన్లతో మాట్లాడింది.
ఇప్పటివరకు ఈ జేపీసీ 38 సార్లు సమావేశమైంది. వక్స్ హెూదా, జిల్లా కలెక్టర్‌కు అధికారాలను అప్పగించడం, వక్స్ బోర్డు నిర్మాణం, ట్రిబ్యునల్ అధికారాలను కల్పించడం వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. జేపీసీకి 44 సవరణలు సైతం అందాయి. వాటిలో 14 సవరణలకు జేపీసీ ఆమోదం లభించింది.
ఈ బిల్లు లోక్‌సభ ముందుకు రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ భోపాల్‌లో పలువురు ముస్లింలు అనుకూల ప్రదర్శనలను నిర్వహించారు. బిల్లుకు మద్దతుగా నినాదాలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు, ప్రధాని మోదీకి తమ మద్దతు తెలియజేస్తూ, ప్లకార్డులను ప్రదర్శించారు.
#WATCH | Madhya Pradesh: Women in Bhopal come out in support of Waqf (Amendment) Bill to be presented today in Lok Sabha. pic.twitter.com/CUaUA3Rtkh
— ANI (@ANI) April 2, 2025
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జైకొట్టారు. మోదీ జీ జిందాబాద్ అంటూ నినదించారు. హమ్ తుమ్హారే సాథ్ హై అంటూ భరోసా ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వక్ఫ్ చట్టంలో సవరణలను తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వారంతా అభిప్రాయపడ్డారు. ఈ సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులకు కేంద్రం రక్షణ కల్పిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications