వస్త్రధారణపై యేసుదాసు వ్యాఖ్య: మండిపడ్డ మహిళలు

మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని యేసుదాసు అన్నారు. యేసుదాసు వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని, మహిళల స్వేచ్ఛపై ఆంక్షలు విధించడమేనని కేరళ మహిళా కాంగ్రెసు నేత బిందు కృష్ణ అన్నారు.
నగరంలో మహిళా కాంగ్రెసు కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. గాయకుడిగా ఏసుదాసుని భారతీయులంతా అభిమానిస్తారని, సంగీతానికి యేసుదాసు అందించిన సేవలకు గర్విస్తారని ఆయన అన్నారు. ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం దురదృష్టకరమని బిందుకృష్ణ అన్నారు.
యేసుదాసు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి. యేసుదాసు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఏది కప్పిపెట్టుకోవాలో దాన్ని కప్పి పెట్టాలని, మహిళలు జీన్స్ ధరిచండం వల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారని యేసు దాసున అన్నారు.












Click it and Unblock the Notifications