ఆర్మీ, పోలీసులకు సవాలు విసురుతున్న మహిళలు, మణిపూర్ లో రంగంలోకి లేడీస్ !

మణిపూర్: మణిపూర్‌లో మహిళల నేతృత్వంలోని బృందాలు కనీసం ఆరు ఆర్టీరియల్ రోడ్‌లను బ్లాక్ చేశాయి, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని దక్షిణ భాగాన్ని భద్రతా దళాలకు అందుబాటులో లేకుండా చేసింది. హింసాత్మక మణిపూర్‌లో లోయ నుండి దక్షిణాది కొండ జిల్లాల వరకు అనేక ప్రదేశాలలోని ప్రధాన రహదారులను మహిళలు నిర్బంధించడం భద్రతా దళాలకు కొత్త సవాలుగా మారిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

మహిళా నిరసనకారులను అడ్డుకొవడానికి భద్రతా దళాలకు సహాయం చేయడంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, పారామిలటరీకి చెందిన మహిళా బృందాలు తగిన సంఖ్యలో లేకపోవడం మణిపూర్ లో ఆందోళనలు చేస్తున్న మహిళల కార్యకలాపాలు అడ్డుకోవడానికి ఆంటకం కలుగుతోందని అధికారులు అంటున్నారు. ప్రభావిత ప్రాంతాలకు బలాలను పంపడంలో జాప్యం జరుగుతోందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మణిపూర్ కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మహిళా బృందాలను పంపినట్లు ఒక అధికారి తెలిపారు.

manipure

మహిళా ఆందోళనకారుల దెబ్బకు ఆరు ప్రధాన రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. బిష్ణుపూర్-చురచంద్‌పూర్, తౌబల్-నాంగ్జింగ్, తౌబల్-యైరిపోక్, యైరిపోక్-చంద్రకాంగ్, కక్చింగ్-లాంకై, ఉరిపోక్-ఇరోయిసెంబా రహదారులను మణిపూర్ లోని మహిళలు నిర్బంధించారని అధికారులు అంటున్నారు. ఒక గ్రామం, ఆస్తిని లక్ష్యంగా చేసుకున్నప్పుడు, దాదాపు 200-300 మంది మహిళలు రోడ్డును నిర్బంధిస్తారని అధికారులు అంటున్నారు.

ఓ వర్గం హింసకు పాల్పడుతోందని, బాధిత గ్రామస్తుల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నా అక్కడికి బలగాలు చేరుకోలేకపోతున్నాయని తెలిసింది. జూన్ 12,13వ తేదీలలో కాంగ్‌పోక్పిలో కుకి గ్రామాలు మీతేయ్ గుంపుచే తగులబడుతున్నప్పుడు మహిళా నిరసనకారులు ఇంఫాల్ నుండి ప్రభావిత ప్రాంతాలకు ఆర్మీ బృందాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ సందర్బంలో కాంగ్‌పోక్పి జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి ఆర్మీ సిబ్బంది కాలినడకన వెళ్లారు.

రాష్ట్రంలోకి వచ్చే నిత్యావసర సరుకులను అడ్డుకునేందుకు కొండ ప్రాంతాల్లో రెండు రకాల దిగ్బంధనాలు చేస్తున్నారు. భద్రతా బలగాలు కూంబింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా మహిళలు అడ్డుకుంటున్నారు. లోయలో రెండు రకాల దిగ్బంధనాలు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. కొండ జిల్లాల గుండా వెళ్లే జాతీయ రహదారి 2ను కుకీ గ్రూపులు బ్లాక్ చేసినప్పటికీ, భద్రతా దళాలు జాతీయ రహదారి 37 నుండి అవసరమైన వస్తువుల సరఫరాను చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4,000 ట్రక్కులు అవసరమైన సామాగ్రిని లోయకు చేర్చారు. మణిపూర్‌లో చాలా ప్రాంతాల్లో రైలు మార్గం లేదు.

manipure

ఫుట్‌హిల్స్ మరియు బఫర్ జోన్‌లను కలపడానికి బుధవారం నుండి 96 గంటల పాటు సుదీర్ఘ గస్తీని పంపడం జరిగిందని అధికారులు అంటున్నారు. బఫర్ జోన్‌లు కుకీ ప్రాబల్యం ఉన్న కొండ జిల్లాలు మరియు లోయలోని మెయిటీ ఆధిపత్య జిల్లాల మధ్య ఉన్న ప్రాంతాలను సూచిస్తాయి. బఫర్ జోన్లలో కేంద్ర బలగాలను మాత్రమే మోహరిస్తున్నామని, విస్తీర్ణం భారీగా ఉన్నందున, మోహరింపు పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని మరో పోలీసు అధికారి తెలిపారు.

పరిస్థితి అదుపు తప్పినందున మమ్మల్ని రక్షించుకోవడానికి మేము రంగంలోకి దిగామని ఇంఫాల్‌కు చెందిన మహిళా కార్యకర్త చెప్పారు.ఇంఫాల్‌లోని మహిళా నాయకులు ప్రతి ఇంటి నుండి కనీసం ఒక మహిళ భద్రతా బలగాల పెట్రోలింగ్ మరియు వాహనాల తనిఖీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అలా చేయడంలో విఫలమైతే రూ. 2,000 జరిమానా విధించబడుతుందని, సహకరించడానికి నిరంతరం నిరాకరించే కుటుంబాలను సామాజికంగా బహిష్కరించాలని అక్కడి కుల పెద్దలు హెచ్చరించారని, మేము చేస్తున్నది ప్రజల కోసం అని మరొ మహిళా కార్యకర్త అన్నారు.

మణిపూర్ లో మే 3వ తేదీ నుండి జరిగిన హింసలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ లో కులాల మధ్య జరుగుతున్న హింసను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరడానికి మణిపూర్ శాసనసభ్యులు ఢిల్లీకి పరుగెత్తుతున్నారు. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇద్దరూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రధాని మోదీకి మెమోరాండం సమర్పించడానికి సిద్దం అయ్యారు. బీజేపీ యేతర పార్టీల ఎమ్మెల్యేలు ఢిల్లీకి పరుగు తీశారు. పార్టీలకు అతీతంగా సమస్యలు పరిష్కరించాలమని మేము డిమాండ్ చేస్తామని ఢిల్లీలో ఉన్న మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె. మేఘచంద్ర మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+