Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌కు వచ్చి మరీ కరోనా బారిన పడ్డ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్

వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా నామినేట్ అయిన ప్రవాస భారతీయుడు అజయ్ బంగా ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. 63 సంవత్సరాల అజయ్ బంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అధికారిక సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం ఆయన అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనకు కోవిడ్ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ గా తేలింది. భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.

అమెరికా నుంచి బయలుదేరే ముందు ఆయనకు విమానాశ్రయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో తన పర్యటనను యధాతథంగా కొనసాగించారు. ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించడానికి ముందుగానే యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాలను పర్యటించాల్సి ఉందాయనకు. అంతకుముందు ఆఫ్రికాలో పర్యటించారు. మూడు వారాల గ్లోబల్ లైజనింగ్ టూర్‌ లో భాగంగా అజయ్ బంగా భారత్ కు వచ్చారు.

అనంతరం ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం ఇక్కడ కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ గా తేలింది. దీనితో అజయ్ బంగా ఐసొలేషన్ లోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం- ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో ఆయన భేటీ కావాల్సి ఉంది. భారత్ అభివృద్ధి ప్రాధాన్యతలు, ప్రపంచ బ్యాంకు నుంచి అందాల్సిన సహాయ, సహకారాలు, ఇతర ఆర్థిక వనరులు, ప్రపంచ ఆర్థికాభివృద్ధి సవాళ్లపై చర్చించడానికి ఈ భేటీ ఏర్పాటైంది.

World Bank president nominee Ajay Banga has tested Covid19 positive after arrival in Delhi

తాజాగా ఆయన కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో ముఖాముఖి భేటీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని నిర్వహిస్తారని చెబుతున్నారు. కాగా- మహారాష్ట్రలోని పుణేలో జన్మించిన అజయ్ బంగాను ప్రపంచబ్యాక్ అధ్యక్షుడిగా అమెరికా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారాయన. విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తరువాత అజయ్ బంగా- నెస్ట్లె ఇండియాలో చేరారు. అనంతరం సిటీ బ్యాంక్‌ లో జాయిన్ అయ్యారు. 1996లో అమెరికాకు వెళ్లిపోయారు.

కాగా- భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతోందనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణగా భావిస్తోన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్.. ఈ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ కేసుల పెరుగుదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది. అటు ప్రధాని కూడా అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహంచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+