విమర్శించే హక్కులేదు, భారత్ వైపు ప్రపంచం: వెంకయ్య
చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన స్వచ్ఛ భారత్‌ను విమర్శించే హక్కు ఎవరికీ లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. దేశ ప్రయోజనం కోసం ప్రారంభించిన కార్యక్రమం పైన ఆరోపణలు సరికాదన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాలులో 'ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు టంగుటూరి, భగత్ సింగ్, అల్లూరి, ఆజాద్ లాంటి నాయకుల చరిత్రను చదవాలన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసు ప్రభుత్వం అరవై ఏళ్లలో దేశానికి అందించిన పాలనను కేవలం ఐదేళ్లలో చేసి చూపుతామన్నారు. రాజకీయ నాయకులు నిత్య విద్యార్థిలా ఉండాలన్నారు. ప్రస్తుతం వాళ్లు సంపాదనే రాజకీయంగా మార్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు దసరా పర్వదినం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుక్లలో వెంకయ్య మాట్లాడుతూ.. మోడీ అమెరికా పర్యటన అనంతరం ప్రపంచం భారత దేశం వైపు చూస్తోందన్నారు.












Click it and Unblock the Notifications