వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం, కానీ.: శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ముంబై: తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయితే, లక్షణాలు ఏమీ లేవని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తెలిపారు. అందుకే తాను ప్రజలను కలవలేకపోతున్నానన్నారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దిశగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బుధవారం సాయంత్రం ప్రజలనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు.

షిండే సహా ఎవరైనా.. రాజీనామాకు సిద్ధమంటూ ఉద్ధవ్ థాక్రే

షిండే సహా ఎవరైనా.. రాజీనామాకు సిద్ధమంటూ ఉద్ధవ్ థాక్రే

తాను సొంత మనుషులు అనుకున్నవాళ్లు ఇప్పుడు తనను వ్యతిరేకిస్తున్నారని ఉద్ధవ్ థాక్రే అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్ షిండే సహా ఎవరైనా నన్ను సీఎంగా వద్దు అని చెబితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అధికారిక నివాసాన్ని వదిలివేస్తానని ఉద్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. రాజీనామా లేఖ కూడా సిద్ధంగా ఉందని ఆయ తెలిపారు. అయితే, అవిశ్వాసానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు.

అది తనకు అవమానమేనంటూ ఉద్ధవ్ థాక్రే

అది తనకు అవమానమేనంటూ ఉద్ధవ్ థాక్రే

కానీ, నా మనుషులు (ఎమ్మెల్యేలు) నన్ను కోరుకోనప్పుడు నేను ఏమి చెప్పగలను. వారికి నాపై ఏదైనా వ్యతిరేకత ఉంటే, సూరత్‌లో ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది, వారు ఇక్కడికి వచ్చి నా ముఖం మీదే చెబితే బాగుండేది అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. తాను ముఖ్యమంత్రిగా దిగిపోవాలంటే రాజీనామా చేస్తా.. శివసేన నుంచి వేరే ఎవరినైనా సీఎం చేయవచ్చు అని అన్నారు. తనకు వ్యతిరకంగా తన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా.. అది తనకు అవమానమేనని అన్నారు.

మాది బాలా సాహేబ్ హిందుత్వమేనంటూ ఉద్ధవ్ థాక్రే

మాది బాలా సాహేబ్ హిందుత్వమేనంటూ ఉద్ధవ్ థాక్రే

బాలా సాహేబ్‌కు తామే అసలైన వారసులమని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. శివసేన హిందుత్వానికి ఎప్పుడూ దూరం కాలేదని చెప్పారు. శివసేన హిందూమతం కలిసే ఉంటాయన్నారు. 'మా ఊపిరిలో హిందుత్వ ఉంది. హిందుత్వానికి ఎవరు ఏం చేశారో మాట్లాడే సమయం ఇది కాదు' అని ఉద్ధవ్ థాకరే అన్నారు, "నేను బాలాసాహెబ్ హిందుత్వను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను." అని చెప్పారు. తాము గత 30 ఏళ్లుగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించామని, కానీ, ఇప్పుడు ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలున్నాయన్నారు. ఇప్పుడున్నది సరికొత్త శిసేన అని అన్నారు.

కొందరు ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటున్నారని ఉద్ధవ్ థాక్రే

కొందరు ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటున్నారని ఉద్ధవ్ థాక్రే

'నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడు నేను సీఎం కాకూడదని కాంగ్రెస్, ఎన్‌సిపి చెబితే అది వేరు, కానీ ఈ రోజు, కమల్ నాథ్ కూడా నేను సీఎం కావాలని చెప్పారు. కానీ నా స్వంత వ్యక్తులు (ఎమ్మెల్యేలు) నన్ను కోరుకోనప్పుడు, నేను ఏమి చెప్పగలను? అని ఉద్ధవ్ థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. 'కొందరు ఎమ్మెల్యేలు తిరిగి వస్తామని మాకు ఫోన్ చేస్తున్నారు' అని ఉద్ధవ్ థాక్రే అన్నారు.
ఏక్ నాథ్ షిండే సహా 34 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంలో క్యాంపు రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. క్యాంపు ఎమ్మెల్యేలంతా తమ నేత షిండేనే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్ధవ్ సోషల్ మీడియా వేదికగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

English summary
Would have resigned if Shinde asked me to do so, My resgnation letteris ready- Uddhav.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X